Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజమౌళి ‘మగధీర’కు ఈ రోజు చాలా స్పెషల్ డే
హైదరాబాద్: తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిన చిత్రాల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర'ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈచిత్రం అప్పట్లో ఓ సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ పరిశ్రమ ముక్కున వేలేసుకునేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు సినిమా స్టామినా ఏమిటో నిరూపించిన చిత్రం ఇది. జులై 31, 2009లో విడుదలైన ఈ చిత్రం నేటితో సరిగ్గా ఆరేళ్లు పూర్తి చేసుకుంది.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన 'మగధీర' చిత్రాన్ని తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెల్లడంలో సక్సెస్ అయ్యాడు. అది సృష్టించిన సంచలనం అంతాఇంతాకాదు. ఏ రకంగా చూసినా మగధీర తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. అందుకు రాజమౌళి పెట్టిన ఇంట్రెస్టే కారణమని చెప్పవచ్చు.
ఇది ఒక యాక్షన్ మరియు ప్రేమ కథా చిత్రం. 400 సం.క్రితం గత జన్మలో ప్రేమలో ఓడిపోయిన కాల భైరవ అనే సైనిక శిక్షకుడు (రామ్ చరణ్ తేజ్) మరియు యువరాణి మిత్ర విందా దేవి (కాజల్) తమ ప్రేమను గెలిపించుకోవడనికి మళ్ళీ పుడతారు. నాలుగు శతాబ్దాల క్రితం ఏమి జరిగింది? మరు జన్మలో వారు ఎలా కలుసుకొన్నారు? వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి?- అనేది చిత్ర కథ.
తెలుగు చలన చిత్ర రంగంలోనే ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయంగా రికార్డును నెలకొల్పింది. అప్పట్లో 223 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు చలన చిత్రం ఇదే. ఈ చిత్ర నిర్మాణ వ్యయం రూ. 40 కోట్లుపైనే. నిర్మాతకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఉపయోగించిన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞ్హానం విమర్శకుల ప్రశంశలను అందుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే గుర్రపు స్వారీ,100 మంది యోధులను సంహరించే సన్నివేశం, ఉదయ్ ఘడ్ లోని దృశ్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. షేర్ ఖాన్ గా శ్రీహరి నటన హైలెట్.

మగధీర స్క్రిప్టు వర్క్
మగధీర చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించడంతో పాటు, స్క్రిప్టు వర్కు కూడా చేసారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రవర్మ కథ అందించారు. ఎం రత్నం డైలాగులు రాసారు.

మగధీర స్టార్ కాస్ట్
రామ్ చరణ్ తేజ్, కాజల్ హీరో హీరోయిన్లు. సునీల్, శ్రీహరి, దేవ్ గిల్, శరత్ బాబు, రావు రమేష్, సమీర్, సలోని అశ్వని, బ్రహ్మానందం, హేమ తదితరులు నటించారు.

చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్
మగధీర చిత్రంలో చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. బంగారు కోడి పెట్ట సాంగులో ఆయన కనిపిస్తారు. ఈ సాంగులో ముమైత్ ఖాన్ నటించింది.

కిమ్ శర్మ ఐటం సాంగ్
మగధీర చిత్రంలో కిమ్ శర్మ ‘జోర్ సే' అనే ఐటం సాంగులో నటించింది.

మగధీర షూటింగ్
మగధీర షూటింగ్ 90 శాతం గుజరాత్, రాజస్థాన్, కర్నాటకలోని బదామిలో జరిగింది. కొన్ని సీన్లు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. బంగారు కోడి పెట్ట సాంగును చెన్నై పోర్టులో చిత్రీకరించారు. ‘నాకోసం నువ్వే' సాంగును స్విట్జర్లాండులో చిత్రీకరించారు. పంచదార బొమ్మ సాంగ్ గోల్కొండ కోటలో చిత్రీకరించారు.

మగధీర టెక్నికల్ టీం
రాజమౌళి వైఫ్ రమ రాజమౌళి కాస్టూమ్ డిజైనర్ గా పని చేసారు. కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ కెమెరా, కోటగిరి విద్యాధరరావు ఎడిటింగ్ విభాగాలు చూసుకున్నారు.

మగధీర గ్రాండ్ రిలీజ్
మగధీర చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ 625 డిజిటల్ యూఎఫ్ ఓ ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా 1250 థియేటర్లలో జులై 31, 2009లో విడుదల చేసారు.

మగధీర కలెక్షన్ రికార్డ్
ఈ సినిమాకు నిర్మాత రూ. 40 కోట్లు ఖర్చు పెట్టగా...రూ. 73.1 కోట్లు వచ్చాయి. అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో ఇదోరికార్డు.

థియేటర్ రన్
మగధీర చిత్రం 302 డైరెక్ట్ సెంటర్లలో 50 రోజులు, 225 సెంటర్లలో 100 రోజులు, 5 థియేటర్లలో 720 డేస్, ఒక థయేటర్లో 1001 రోజులు ఆడింది.

మగధీర తమిళ వెర్షన్
తమిళ వెర్షన్లో మగధీర చిత్రం 350 థియేటర్లలో విడుదలైంది. రూ. 8 కోట్లు వసూలు చేసింది.

మగధీర మళయాలం
మళయాలంలో ధీర పేరుతో విడుదలైన ఈచిత్రం రూ. 3 కోట్లు వసూలు చేసింది.

మగధీర అవార్డులు
మగధీర చిత్రానికి రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వివిధ కేటగిరీల్లో వచ్చాయి.

మగధీర డివిడి రిలీజ్
మగధీర చిత్రాన్ని డివిడి వెర్షన్లో కూడా విడుదల చేసారు. డివిడి వెర్షన్ కూడా భారీ ఎత్తున అమ్ముడయింది.

మగధీర రైట్స్
మగధీర చిత్రానికి శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, హోం మీడియా రైట్స్ పేరుతో భారీగా వచ్చాయి.

ట్రెండ్ సెట్టర్ మూవీ
మగధీర చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచింది.