»   » ఆ క్రెడిట్ అంతా రాజమౌళి సుపుత్రుడిదేనట!

ఆ క్రెడిట్ అంతా రాజమౌళి సుపుత్రుడిదేనట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'బాహుబలి' మేకింగ్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియో విడుదలైన అనంతరం రాజమౌళికి పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. అయితే ఈ మేకింగ్ వీడియో అంతబాగా రావడానికి కారణం తన కొడుకు కార్తికేయ కారణమని, అతనే తన టీంతో కలిసి దాన్ని అంత అట్రాక్టివ్‌గా మార్చాడని రామజౌళి అంటున్నాడు.

మొత్తానికి తన కొడుకు తన బాటలోనే ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఆసక్తిగా ముందుకు సాగుతుండటం, బాహుబలి సినిమా మేకింగులో పాలు పంచుకుంటుండంపై రాజమౌళి చాలా హ్యాపీగా ఉన్నారట. కార్తికేయను భవిష్యత్‌లో ఒక మంచి దర్శకుడిగా లేదా నిర్మాతగా తీర్చి దిద్దాలని రాజమౌళి కలలుకంటున్నాడట. మరి తండ్రి కోరిక మేరకు కార్తికేయ ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

<blockquote class="twitter-tweet blockquote"><p>Team <a href="https://twitter.com/search?q=%23Baahubali&src=hash">#Baahubali</a> is Super excited that all of you liked it This video is done by <a href="https://twitter.com/ssk1122">@ssk1122</a> &his team The concept&execution is entirely theirs</p>— rajamouli ss (@ssrajamouli) <a href="https://twitter.com/ssrajamouli/statuses/392977366533689344">October 23, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

బాహుబలి సినిమా విషయానికొస్తే.... షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

English summary
Rajamouli said about his son, “Team Bahubali is super excited that all of you liked it. This video is done by Karthikeya and his team. The concept and execution is entirely theirs.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu