»   » మొన్న బాలయ్య...ఇప్పుడు రాజమౌళి..నెక్ట్స్ మరెవరో

మొన్న బాలయ్య...ఇప్పుడు రాజమౌళి..నెక్ట్స్ మరెవరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో సర్కార్ 3 సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలతో ఇప్పటికే ఘన విజయాలు సాధించిన వర్మ ఆ వరుసలో తీసున్న మూడో చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబాయ్ లో జరుగుతోంది. కాగా ఈ సినిమా సెట్స్ లో ఊహించని గెస్ట్ లు దర్శనమిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం సర్కార్ 3 సెట్స్ కి బాలకృష్ణ వెళ్ళి,అమితాబ్ ని కలిసిన సంగతి తెలిసిందే. తను తదపరి చేయబోయే కొత్త సినిమా రైతులో రాష్ట్రపతి పాత్ర చేయమని అడగటం కోసం కృష్ణ వంశీని తీసుకుని మరీ ..బిగ్ బి కలిసారు. ఆ ఫొటోలు మీడియాలో సెన్సేషన్ గా నిలిచాయి.

తాజగా మరో స్పెషల్ గెస్ట్ సర్కార్ సెట్స్ లో మెరిసారు. ఆయన ఎవరో కాదు. ది గ్రేట్ బాహుబలి రాజమౌళి. సర్కార్ సెట్స్ లో ఆయన కనపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. సర్కార్ 3 దర్శకుడు వర్మ ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

' ఫిల్మ్ మేకింగ్ లో బాహుబలి యాక్టింగ్ లో బాహుబలి తో కలిసారు" అని ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు వర్మ. కాగా, బాహుబలి ప్రమోషన్ కోసం ముంబాయ్ వెళ్ళిన రాజమౌళి మర్యాద పూర్వకంగానే అమితాబ్ ను కలిసారని తెలిస్తోంది.

ఇక సర్కార్ 3 విషయానికి వస్తే.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో గత వారమే ప్రారంభమైన 'సర్కార్-3' (సర్కార్ సిరీస్) చిత్రం లీగల్ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.

Rajamouli

నరేంద్ర హిరావత్ అనే వ్యక్తి ఈ చిత్రం ప్రీక్వెల్, సీక్వెల్, రీమేక్, వరల్డ్ నెగిటివ్ రైట్స్ తనకే ఉన్నాయంటూ చిత్ర దర్శకనిర్మాతలకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. వర్మ నుంచి సరైన సమాధానం రాకుంటే కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా హిరావత్ ఉన్నారట. గతంలోనూ అమితాబ్ చిత్రం 'ఆంఖే 2' రీమేక్ రైట్స్ విషయంలో ఇలాంటి వివాదమే తలెత్తింది.

ఇక ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులైన అమితాబ్, మనోజ్ బాజ్‌పేయి, జాకీ షరాఫ్, అమిత్ సేథ్, రోనిత్ రాయ్, యామి గౌతమ్, రోహిణి హట్టంగడికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వర్మ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం తనపై ఓ పాట రికార్డింగ్ కూడా జరిగినట్టు అమితాబ్ కూడా తెలిపారు.

English summary
Ace director SS Rajamouli, who is busy with the shooting of Baahubali 2, was spotted bonding big time with Bollywood megastar Amitabh Bachchan on the sets of Ram Gopal Varma's upcoming film Sarkar 3.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu