»   » రాజమౌళి ఆంక్షలతో...ప్రభాస్‌ హౌస్ అరెస్ట్!

రాజమౌళి ఆంక్షలతో...ప్రభాస్‌ హౌస్ అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అవును నిజంగానే ప్రభాస్ హౌస్ అరెస్ట్ అయ్యాడు! ఇంటి నుంచి కాలు బయటకు పెట్టడం లేదు. ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఎవరికీ కనిపించకుండా...ముఖ్యంగా మీడియా కంట పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కుతున్న 'బాహుబలి' సినిమా కోసమే.

సినిమా పూర్తయ్యే వరకు ప్రభాస్ లుక్ బయటకు రాకూడదనే రాజమౌళి ఈ ప్లాన్ చేసారట. పబ్లిక్ కార్యక్రమాలకు ఎక్కడికీ వెళ్ల కూడదని, మీడియా కంట అస్సలు పడకూడదనీ స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారట. బాహుబలి షూటింగ్ జరిగే స్పాట్లో కూడా ప్రభాస్‌ను ఎవరూ సెల్ ఫోన్లో చిత్రీకరించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారట రాజమౌళి.

తన కెరీర్లో ఏ సినిమాకు పడనంత కష్టం ఈ సినిమా కోసం పడుతున్నాడు ప్రభాస్. యుద్ద విద్యలు, గుర్రం స్వారీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. దీని తర్వాత తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు ప్రభాస్.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో దాదాపు రూ. 2.5 కోట్ల ఖర్చుతో భారీ దర్బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

ఈ చిత్రంలో ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
According to Film Nagar sources, The ace film maker Rajamouli has given Prabhas strict instructions to not to make any public appearances and he doesn’t want prabhas to fall in limelight for his professional reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu