»   » 'ఈగ' చిత్రం గురించి రాజమౌళి హాట్ న్యూస్

'ఈగ' చిత్రం గురించి రాజమౌళి హాట్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మర్యాద రామన్న విజయం తర్వాత ప్రస్తుతం రాజమౌళి ఏం చేస్తున్నారు..ఏం చేయబోతున్నారు అనే సందేహం అందరికీ కలుగుతుంది. దానికి సమాధానంగా రాజమౌళి తాజాగా ట్వీట్ చేస్తూ...నేను ప్రస్తుతం ఈగ సబ్జెక్టు మీద వర్క్ చేస్తున్నాను. ఓ నెలలో ఈ చిత్రం గురించి పూర్తి డెశిషన్ తీసుకుంటాను అంటున్నారు. ఇక ప్రభాస్ చిత్రం నెక్ట్స్ మార్చిలో మొదలవతుంది. ఈ లిమిటెడ్ సమయంలో ఓ చిన్న సినిమా చేస్తాను. ఇక ఈగ చిత్రం యానిమేషన్ మరియు లైవ్ యాక్షన్ తో నిండి ఉంటుంది అన్నారు.

ఇక ఆ మద్య ఈ ఈగ చిత్రం గురించి చెబుతూ.."నా తదుపరి చిత్రం ఆర్‌.కె.ప్రొడక్షన్స్‌లో ప్రభాస్‌తో చేస్తాను. అయితే ప్రభాస్‌ వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఈలోగా 'ఈగ' అనే ప్రయోగాత్మక చిత్రం చేద్దామా? వద్దా? అనే సంశయంలో ఉన్నాను. మహేష్ ‌బాబుతో కథా చర్చలు జరిగాయి. నాగార్జునతో నాన్నగారు ఒక సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో యాక్షన్‌ ఘట్టాల్ని నేను తెరకెక్కిస్తాను" అన్నారు.

ఇక ఇక 'ఈగ' చిత్రంలో హీరో ఉండరని ఎగిరే ఈగ ప్రధాన పాత్ర వహిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు గత కొంతకాలంగా స్క్రిప్టు వర్క్ నడుస్తోంది. పూర్తి స్ధాయి గ్రాఫిక్స్ తో కూడిన ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఈ 'ఈగ' ని తీర్చిదిద్దాలని రాజమౌళి భావిస్తున్నారు. హాలీవుడ్ లో తేనెటీగ ప్రధానపాత్రలో వచ్చి హిట్టయిన బీ మూవీ (2007) తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. అయితే 'ఈగ' మాత్రమే గ్రాఫిక్స్ అనీ మిగతా పాత్రల్లో మనుష్యులు ఉండనున్నారని చెప్తున్నారు. ఇక కథ మొత్తం 'ఈగ' పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది.అలాగే రాజమౌళి ..హెచ్ ఎమ్ టీవీ కోసం..కమాన్ ఇండియా అనే పోగ్రాం ని చేస్తున్నారు. ఈ పోగ్రాం..ఈ నెల 30 తేదీ నుంచి మొదలవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu