»   » ఇదిగో బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రాజమౌళి రివ్యూ

ఇదిగో బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రాజమౌళి రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎప్పటిలాగే ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన చూసిన సినిమాలపై వెంటనే ట్విట్టర్ లో స్పందించారు. నిన్ని చిరంజీవి రీలాంచ్ చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రం చూసి సినిమాపై ప్రశంసలు వర్షం కురించిన ఆయన తాజాగా నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని చూసారు.

ఈ సినిమాపై ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. ముందుగా బాలకృష్ణని ఉద్దేశించి ట్వీట్ చేసారు. సాహో బసవతారకరామపుత్ర అన్నారు.దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని కొనియాడారు.'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.రచయిత సాయిమాధవ్‌ సంభాషణలు, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తెలుగు చిత్రాల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు.నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం' గౌతమిపుత్ర శాతకర్ణి'. ఆయన కెరీర్‌లో వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో అటు అభిమానులే కాదు ఇటు సగటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై అమితాశక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రత్యేక షోను అభిమానుల కోసం ఈరోజు ప్రదర్శిస్తున్నారు. దీనికి నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు అభిమానులతో కలిసి సినిమాను వీక్షిస్తున్నారు.


నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ముందస్తుగా ప్రదర్శంచారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ అభిమానులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నారా రోహిత్‌ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. బాలకృష్ణ అభినయం, డైలాగులకు ప్రేక్షకుల విశేష స్పందన వచ్చింది.


Rajamouli tweets on Balayya's Gautamiputra Satakarni

ఇక నిన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురింపిచారు. 10 సంవత్సరాలు మెగాస్టార్‌ చిరంజీవిని మిస్‌ అయ్యామని ట్వీట్‌ చేశారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌!! చిరంజీవిగారు తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు. 10 సంవత్సరాలు మిమ్మల్ని మిస్‌ అయ్యాం. రికార్డు బ్రేకింగ్‌తో నిర్మాతగా తెరంగేట్రం చేసిన చరణ్‌కు శుభాకాంక్షలు. వినయ్‌గారు.. కుమ్మేశారంతే.. మీకన్నా బాగా ఈ ప్రాజెక్టును ఇంకెవరూ తీయలేరు. టీమ్‌ కేఎన్‌150.. ఇది పెద్ద విజయం' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.


ఇప్పటికే ఈ చిత్ర యీనిట్ ని సోషల్‌మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్ గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.


English summary
ssrajamouli tweeted:Saaho Basavatarakarama puthra BALAKRISHNA!!!I salute you sir for your potrayal of Satakarni that will make nandamuri Satakarni's sword. Excellent camera work and extraordinary production values make Satakarni a proud telugu film to remember for a long time.How in the heavens could you make this epic in 79days? Unbelievable..i have got a lot lot to learn from you..Saimadhav garu, your pen is. proud. He will shower his blessings from above. Anjanaputhra Krish the blessings of 12 crore telugus across the globe will be with you.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X