»   » నిర్మాతల్లో ఆందోళన: రెమ్యూనరేషన్ విషయంలో రాజమౌళి క్లారిటీ!

నిర్మాతల్లో ఆందోళన: రెమ్యూనరేషన్ విషయంలో రాజమౌళి క్లారిటీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీ ఎవరు అంటే.... ముందుగా వినిపించే పేరు ఎస్‌ఎస్ రాజమౌళి. 100శాతం సక్సెస్ రేటుతో పాటు బాహుబలి, మగధీర లాంటి రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు ఆయన లిస్టులో ఉన్నాయి.

సక్సెస్ రేటు ఎక్కువగా కాబట్టి రాజమౌళి తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. రూ. 1600 కోట్లకు పైగా వసూలు చేసిన 'బాహుబలి' ప్రాజెక్టుకు ఆయన లాభాల్లో పర్సంటేజ్ తీసుకున్నారు. ఇంతకు ముందు వరకు మాత్రం ఆయన సినిమాకు ఇంత అని ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ పుచ్చుకునేవారు.

నిర్మాతల్లో ఆందోళన

నిర్మాతల్లో ఆందోళన

బాహుబలి ప్రాజెక్టుతో రాజమౌళి రెమ్యూనరేషన్ విషయంలో పర్సంటేజీ లెక్కల్లోకి మారడంతో పలువురు టాలీవుడ్ నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు పర్సంటేజీల్లోకి మారిపోయారు. ఇపుడు రాజమౌళి అదే బాటలో నడిస్తే..... పెట్టుబడి పెట్టిన తమకు పెద్దగా మిగిలేదేమీ ఉండదనే విచారంలో ఉన్నారట.

క్లారిటీ ఇచ్చిన రాజమౌళి?

క్లారిటీ ఇచ్చిన రాజమౌళి?

తన రెమ్యూనరేషన్ గురించి ఇలాంటి చర్చ మొదలవ్వడంతో రాజమౌళి స్పష్టమైన సందేశం పంపినట్లు సమాచారం. ఎప్పటిలాగే తాను ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ తీసుకుంటానని రాజమౌళి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బాహుబలి ప్రత్యేకమైన మూవీ

బాహుబలి ప్రత్యేకమైన మూవీ

బాహుబలి సినిమా చాలా ప్రత్యేకమైనది. ఆ సినిమా కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది కాబట్టి ఆ సినిమాకు ఫిక్డ్స్ రెమ్యూనరేషన్ కాకుండా పర్సంటేజీ రూపంలో తీసుకోవాల్సి వచ్చింది అని రాజమౌళి వివరించారట.

తర్వాతి సినిమా గురించి రాజమౌళి

తర్వాతి సినిమా గురించి రాజమౌళి

దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమా గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్టు రెడీ అవుతున్నట్లు తెలిపారు.

అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బాహుబలి డబ్బుతో.... ఖరీదైన కారు కొన్న రాజమౌళి! (ఫోటోస్)

బాహుబలి డబ్బుతో.... ఖరీదైన కారు కొన్న రాజమౌళి! (ఫోటోస్)

బాహుబలి సినిమా ద్వారా వచ్చిన డబ్బతో రాజమౌళి ఖరీదైన కారు కొన్నారు. ఇంకా ఆయన ఆ డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాల కోసం

క్లిక్ చేయండి

ప్రేయసికి దూరమైన రాజమౌళి

ప్రేయసికి దూరమైన రాజమౌళి

దర్శకుడు రాజమౌళి గత జన్మలో ఎక్కడ జన్మించారు? ఆ జన్మలో అతడి జీవితం ఎలా సాగింది అనే విషయాలను ఇటీవల ఓ జ్యోతిష్కుడు వెల్లడించారు. గత జన్మలో రాజమౌళి ప్రేయసికి దూరమై చాలా బాధ అనుభవించారట.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
For Baahubali 2, Rajamouli has taken a percentage from profits. While for all his earlier movies, he never involved in percentage basis which is a huge relief to producers. Even for future projects, it is learnt that Rajamouli will only follow a standard rate chart.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu