»   » రోబో ‘2.0’ ఫ్యాన్ మేడ్ ట్రైలర్, జనం తిడుతున్నారు కానీ తెగ చూస్తున్నారు

రోబో ‘2.0’ ఫ్యాన్ మేడ్ ట్రైలర్, జనం తిడుతున్నారు కానీ తెగ చూస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ :సాదారణంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఫ్యాన్ మేడ్ వీడియోలు ఒక్కోసారి సంచలనాలే సృష్టిస్తుంటాయి. అలాంటివి మనం ఎన్నో చూసాం. అంతెందుకు కొన్ని సందర్భాలో ఒరిజినల్ ట్రైలర్ ల కంటే కూడా ఈ ఫ్యాన్ క్రియేటివిటీ ట్రైలర్స్ బాగుంటాయి కూడా. అదే కోవలో రజనీకాంత్ తాజా చిత్రం రోబో 2 చెందిన ఫ్యాన్ మేడ్ ట్రైలర్ ఒకటి యూట్యూబ్ లో రికార్డ్ లు బ్రద్దలుకొడుతోంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


క ఈ ట్రైలర్ క్రింద యూట్యూబ్ లో వచ్చిన కామెంట్స్ ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జనం ఈ ట్రైలర్ ని తెగ తిడుతున్నారు. కానీ అదే స్దాయిలో తెగ చూస్తున్నారు. అంటే రోబో 2 కోసం అంతలా ఎదురుచూస్తున్నారన్నమాట.

ఈ ట్రైలర్ లో రజినీ హీరోయిజం, విలన్ అక్షయ్ కుమార్, అలాగే అమీ జాక్సన్ అందాలను కూడా హాలీవుడ్ రేంజ్లో ప్రజెంట్ చేస్తూ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిక్స్ చేసి వదిలారు. దాంతో ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

ఈ చిత్రం గురించి రజనీ మాట్లాడుతూ... ''ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచబోతోంది. అయితే ఇందులో హీరోని నేను కాదు, అక్షయ్‌కుమారే. నాకు ఎంపిక చేసుకొనే అవకాశమొచ్చుంటే నేను అక్షయ్‌కుమార్‌ పాత్రనే ఎంచుకొనేవాణ్ని. శంకర్‌తో పనిచేయడం చాలా కష్టం. ఆయనొక పర్‌ఫెక్షనిస్ట్‌. భారతీయ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది. త్రీడీలో నన్ను నేను చూసుకోవడం కొత్తగా అనిపించింద''అన్నారు రజనీకాంత్‌.

అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ ...''భారతీయ సినీ పరిశ్రమలో '2.0' ఓ చరిత్రని సృష్టించబోతోంది. నా జీవితంలో ఎప్పుడూ మేకప్‌ వేసుకోలేదు. కానీ ఈ సినిమా కోసం రోజూ 3 గంటలపాటు మేకప్‌ వేసుకొని నటించాల్సి వచ్చింది. రజనీకాంత్‌గారితో కలిసి నటించడం చక్కటి అనుభవం'' అన్నారు.

దర్శకుడు శంకర్ మాట్లాడుతూ...''రోబో'కి కొనసాగింపుగా 2.0తో పాటు, మరొక చిత్రం కూడా ఉండబోతోంది.ఈ సినిమా ప్రయాణం భుజాలపై ఒక ఎవరెస్ట్‌ని పెట్టుకొని ఎవరెస్ట్‌ని ఎక్కుతున్నట్టుగా అనిపిస్తోంది''అన్నారు .

'రోబో'కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రమే '2.0'. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్నారు. అమీజాక్సన్‌ హీరోయిన్ . బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ విలన్ గా నటిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరకర్త. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రీడీలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

English summary
if you're yet to watch Robo 2 fan made trailer, you should go and do so immediately. The audience has been eagerly waiting for the sequel of Rajinikanth’s Robot to release soon. The Rajini fans loved the first part and since then have been waiting for a second part.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu