రూమర్లు నిజమాయే.. రాజశేఖర్ కూతురు శివాని గురించి లేటేస్ట్ న్యూస్

By Rajababu

Recommended Video

రాజశేఖర్ కూతురు పై.. రూమర్లు నిజమాయే..!

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్, డాక్టర్ రాజశేఖర్ కుమార్తే శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్లో రూపొందే చిత్రం ద్వారా శివాని సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నది. ఈ చిత్రంలో అడవి శేషు హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ జరుగనున్నది.

 2 స్టేట్స్ రీమేక్‌లో శివానీ

2 స్టేట్స్ రీమేక్‌లో శివానీ

శివానీ, అడవి శేషు జంటగా నటిస్తున్న ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 2 స్టేట్స్ అనే చిత్రానికి రీమేక్. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు వెంకట్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎల్‌వీ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

యువతను ఆకట్టుకొనేందుకు

యువతను ఆకట్టుకొనేందుకు

తెలుగు నేటివిటికి దగ్గరగా ఉండేలా రూపొందించిన స్క్రిప్టు కారణంగా ఈ చిత్రంలో నటించడానికి శివానీ ముందుకు వచ్చినట్టు తెలిసింది. యువతను ఆకట్టుకొనే విధంగా రూపొందే ఈ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం అందించనున్నారు. నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

విభిన్నమైన నటుడు అడవి శేషు

విభిన్నమైన నటుడు అడవి శేషు

క్షణం, బాహుబలి చిత్రాలతో ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్న అడవి శేషు ప్రస్తుతం గూఢచారి అనే చిత్రంలో అడవి శేషు నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండటం, రాజశేఖర్ కూతురు తొలి చిత్రం కావడమనే అంశాలు అడవి శేషును ఆకట్టుకున్నట్టు తెలిసింది.

 తండ్రి రాజశేఖర్ బాటలో శివాని

తండ్రి రాజశేఖర్ బాటలో శివాని

రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తండ్రి బాటలోనే ప్రయాణిస్తూ డాక్టర్‌గా మారిన ఈ ముద్దు గుమ్మ యాక్టర్ అవ్వడం గమనార్హం. గతంలో తమిళ చిత్రం ద్వారా శివానీ సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ చివరకు తెలుగు పరిశ్రమ ద్వారానే తన అద‌ృష్టాన్ని పరీక్షించుకోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X