»   »  సరైన వైద్యం అందిందా? ఏదో పొరపాటు జరిగింది: దాసరి మరణం పై రాజశేఖర్ వ్యాఖ్య

సరైన వైద్యం అందిందా? ఏదో పొరపాటు జరిగింది: దాసరి మరణం పై రాజశేఖర్ వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనవరి నెలలో దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారనే వార్త బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేని దాసరి ఐసీయూ లో చికిత్స తీసుకునే అంత అనారోగ్యం ఏంటనేదే అందరి అనుమానం.

మధుమేహం

మధుమేహం

దాసరి నారాయణ రావుకు వయస్సుతో పాటే వచ్చే మధుమేహం తప్ప మరే దీర్ఖకాలిక వ్యాధులు లేవు. అయితే బరువు తగ్గేందుకు దాసరి తీసుకున్న నిర్ణయాలే ఈ ఘటనకు కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి.. అయితే 75 ఏళ్ల వయస్సులో బేరియాట్రిక్ సర్జరీ కి సిద్దపడి మంచిది కాదని సన్నిహితులు వారించినా దాసరి వెనక్కు తగ్గలేదని తెలుస్తుంది.

పలు సర్జరీలు

పలు సర్జరీలు

అయితే ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైందని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. బాడీలోని కొవ్వును బయటకు తీసే క్రమంలో పలు సర్జరీలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దాసరి అన్నవాహికకు గాయం అయినట్లు ప్రచారం. దాసరి బరువు తగ్గించుకునే క్రమంలో రెండోసారి చేయించుకున్న సర్జరీ ఫెయిలైందని.. దాని మూలంగానే రకరకాల కాంప్లికేషన్లు వచ్చి చనిపోయారని ఆయన తనయురాలు హేమాలయ.. అల్లుడు రఘు (డాక్టర్) వెల్లడించిన సంగతి తెలిసిందే.

హీరో రాజశేఖర్

హీరో రాజశేఖర్

ఇప్పుడు ఇదే విషయం లో హీరో రాజశేఖర్ కూడా అలాగే స్పందించారు. యాక్టరే కాదు రాజశేఖర్ డాక్టర్ కూడా కదా... దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి విషయంలో ఒక వైద్యుడిగా తనకు కొన్ని సందేహాలున్నట్లుగా రాజశేఖర్ మాట్లాడాడు. దాసరికి వైద్యం అందించే విషయంలో ఎక్కడో ఏదో పొరబాటు జరిగిందని రాజశేఖర్ అభిప్రాయపడ్డాడు. దాసరి సంస్మరణ సభలో మాట్లాడుతూ రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అస్సలు ఊహించలేదని

అస్సలు ఊహించలేదని

దాసరి తన లాంటి ఎంతోమందికి స్ఫూర్తి అని.. ఆయన లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరని అన్న రాజశేఖర్.. ఆయన 75 ఏళ్ల వయసులోనే చనిపోతారని తాను అస్సలు ఊహించలేదని అన్నాడు. చనిపోవడానికి కొన్ని నెలల ముందు కూడా దాసరి చాలా ఆరోగ్యంగా కనిపించారని.. అందుకే ఆయనకు ఇలా కావడం తనకు పెద్ద షాక్ అని రాజశేఖర్ అన్నారు.

ఎక్కడైనా ఏదైనా పొరబాటు జరిగిందా

ఎక్కడైనా ఏదైనా పొరబాటు జరిగిందా

ఆయనకు సరైన వైద్యం అందిందా.. ఒక వేళ అంది ఉంటే ఎక్కడైనా ఏదైనా పొరబాటు జరిగిందా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఏదేమైనప్పటికీ ఘోరం జరిగిపోయిందని.. దాసరి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక డాక్టర్ గా ఆయన ఆరోగ్యాన్ని అర్థం చేసుకొన్న రాజశేఖర్ మరింత భాదపడ్డాడు.

English summary
Actor Rajasekhar emotional Speech at Dr Dasari Narayana Rao Condolence meeting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu