For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయన చేష్టలతో విసిగిపోయా.. అందుకే రాజీనామా చేశా.. రాజశేఖర్ బహిరంగ లేఖ

  |
  Rajasekhar Resigns As MAA Vice President, Gets Emotional

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఉన్న విభేదాలు అందరికీ తెలిసినా.. నేటి మా డైరీ ఆవిష్కరణ ఈవెంట్లో మరోసారి బయటపడ్డాయి. నేటి ఈ వేడుకల్లో చిరంజీవి ప్రసంగంపై రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినీ పెద్దలు ఫైర్ అయ్యారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన భర్త తరుపున వేదికపై నుంచే అందరికీ జీవితా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఈ ఉదంతంలో చివరకు రాజ శేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు.

  మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే..

  మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే..

  ‘మా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి మా అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో అసోసియేషన్‌కు మంచి చేయడానికే ప్రయత్నించాను. అయితే ప్రతీసారి ఆయన కమిటీలో ఉన్న మెంబర్స్ అందర్నీ కించపరిచే విధంగా మాట్లాడటం, ఎన్నో విషయాల్లో తక్కువ చేసి చూడటం లాంటివి చేశారు. ఇంత జరిగినా.. అసోసియేషన్‌లో ఉండేందుకు నా శాయ శక్తుల ప్రయత్నించాను.. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశాను.

  ఇష్టం వచ్చినట్టు..

  ఇష్టం వచ్చినట్టు..

  అయితే నరేష్ మాత్రం అదే పద్దతిని కొనసాగిస్తూ వచ్చాడు. పారదర్శకతను పాటించకుండా ఎన్నో తప్పులు చేస్తూనే వచ్చాడు. ఏ విషయంలోనూ మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా.. ఆయనకు నచ్చిన విధంగానే చేశాడు. నేటి ఈ వేడుకకు సంబంధించి వివరాలు కూడా ఎవ్వరితోనూ విపులంగా చర్చించలేదని, వాట్సప్ మెసెజ్‌ అది కూడా జీవితకు మాత్రమే పంపాడు.

  ఎన్నోసార్లు పెద్దల సమక్షానికి..

  ఎన్నోసార్లు పెద్దల సమక్షానికి..

  మేము మా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇదే పద్దతిని అవలంభిస్తున్నాడు. నరేష్ వ్యవహారంపై సినీ పెద్దలకు, మా సభ్యులకు కూడా ఎన్నో సార్లు చెప్పాం. నేను ఎంతో కష్టపడి ప్రయత్నించి.. పెద్దల వద్దకు తీసుకొచ్చినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

  నరేష్ పద్దతి నచ్చలేదు..

  నరేష్ పద్దతి నచ్చలేదు..

  అందుకే ఈరోజు వేడుకల్లో నాలోని ఫీలింగ్స్‌ను బయటపెట్టాను. అయినా సరే మరోసారి మీకు చెబుతున్నాను.. నేను అలాగే ఉంటాను. నేను చాలా సున్నితమైన భావాలున్న వ్యక్తిని.. మీకు నచ్చినా నచ్చకపోయినా.. ముక్కుసూటిగా వెళ్లే మనిషిని. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని నా పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నేటి వేడుకలో నరేష్ చేసింది నచ్చలేదు. మీ అందరూ నన్ను సరిగా అర్థం చేసుకుంటార'ని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

  English summary
  Movie Artists Association Dairy Inauguration 2020 held at Park Hayat of Hyderabad. Chiranjeevi, Mohan Babu, Krishnam Raju attended the function.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X