twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు 150వ సినిమాలో విలన్‌గా నన్ను.. : రాజశేఖర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో చిరంజీవి 150వ సినిమాలో విలన్‌గా చేస్తున్నారట కదా అని చాలా మంది అడిగారు. నిజంగా నా దగ్గరకు ఎవరైనా వచ్చి కథ చెప్తే చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కథ నచ్చితే ఏ తరహా సినిమానైనా చేస్తాను అంటూ చిరుతో తాను చేయటానికి ఏ అభ్యంతరం లేదని తెలియచేసారు. ఇదే విషయమై గతంలోనూ ఓ సారి అవకాసమొచ్చిందని రాజశేఖర్ అన్నారు.

    ఆ విషయాన్ని రాజశేఖర్ గుర్తు చేస్తూ...'స్నేహం కోసం'లో విజయ్‌కుమార్‌ చేసిన పాత్ర నేను పోషించాల్సింది. వయసు రీత్యా పెద్ద పాత్ర అవుతుందనే ఉద్దేశంతో చిరంజీవి వద్దన్నారు. లేకపోతే మా కాంబినేషన్ లో సినిమా వచ్చేది అన్నారు. అలాగే నాకు మల్టీస్టారర్‌ చిత్రాలు చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అన్నారు.

    నేనూ నాగార్జున కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మనమిద్దరం కలిసి ఓ సినిమా చేద్దామని బాలకృష్ణ కూడా ఓ సారి అడిగారు. కథ నచ్చితే మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇటీవలే గెస్ట్‌రోల్‌ ఒకరు అడిగారు. కోటి రూపాయలు ఆఫర్‌ చేశారు. పారితోషికం బాగుందనిపించింది. అయితే పాత్ర నచ్చితేనని షరతు పెట్టాను. పెదారయుడులో రజనీకాంత్‌ తరహా పాత్ర అన్నారు. అవి విన్నాక నిర్ణయం చెబుతాను అన్నారు.

    రాజశేఖర్ స్క్రీన్‌ప్లే సమకూర్చి హీరోగా నటించిన చిత్రం 'మహంకాళి'. జీవిత దర్శకత్వం వహించారు. ఈ రోజు (సోమవారం) పుట్టినరోజు జరుపుకోనున్న రాజశేఖర్ 'మహంకాళి' గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియాతో ముచ్చటించారు.

    తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ... 'పెళ్లైన కొత్తలో' మదన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆయనే 'తలంబ్రాలు' తరహాలో మరో కథ కూడా చెప్పారు. దాన్ని కూడా ఓకే చేశాను. అలాగే మహదేవన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టులను మేమే నిర్మిస్తాం.''

    English summary
    Rajashekar about his wish to act with Chiranjeevi 150 film as a villan and Multi Starar Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X