»   » నట్టి కుమార్ నిర్మాతగా... డాక్టర్ రాజశేఖర్

నట్టి కుమార్ నిర్మాతగా... డాక్టర్ రాజశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరసగా ఆగిపోయిన సినిమాలను తీసుకుని రిలీజ్ చేస్తున్న నట్టికుమార్ నిర్మాతగా రాజశేఖర్ ఓ చిత్రం చేస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 5న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమవుతుంది. శ్రీహరి తో చేసిన 'దాసన్నా' చిత్రం తర్వాత తను నిర్మించే మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇదనీ, ఈ సినిమా కూడా తమ సంస్థ ప్రతిష్టను పెంచుతుందనే నమ్మకం ఉందని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. అలాగే 'గోరింటాకు' చిత్రం తర్వాత డా.రాజశేఖర్ ఈ సినిమాలో మరో ఉదాత్తమైన పాత్రను పోషిస్తున్నారనీ, ఏడుగురు తమ్ములకు అన్నగా ఆయన పాత్ర ఎంతో హుందాగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తారని, వారి వివరాలను చిత్రం ప్రారంభోత్సవం రోజున వెల్లడిస్తామని నట్టి కుమార్ చెప్పారు. చిత్ర నిర్మాణంగా ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తామని, పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన స్క్రిప్ట్ అందించారని ఆయన తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu