కృష్ణం రాజు, రాఘవేంద్రావు, రాజమౌళి
ప్రముఖ నటుడు కృష్ణం రాజు, దర్శకుడు రాఘవేంద్రరావు, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖుల మధ్య ఈ మూవీ గ్రాండ్‌గా ప్రారంభం అయింది.
రాజమౌళి క్లాప్
తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జీవితరాజశేఖర్ దంపతులకు అత్యంత ఆప్తులైన కృష్ణంరాజు తన భార్యతో కలిసి వచ్చి శివానీని ఆశీర్వదించారు.
వెంకట్ కుంచ దర్శకుడిగా
ఈ చిత్రం ద్వారా వెంకట్ కుంచ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ‘2 స్టేట్స్' మూవీ హిందీలో సూపర్ హిట్ అవ్వడంతో, దాన్నే తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి రూపొందిస్తున్నారు.
భాగ్యశ్రీ, రజత్ కపూర్
ఈ చిత్రంలో శివానీ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, తండ్రి పాత్రలో రజత్ కపూర్‌ను తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో పాటు సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడంలో భాగంగా తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని యాక్టర్లను తీసుకుంటున్నారట.
లక్ష్య ప్రొడక్షన్స్
లక్ష్య ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రం రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. అడవి శేషు నటించిన ‘క్షణం' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానియెల్ డియో ఈ చిత్రానికి ఎంపికయ్యారు.