»   »  అభిమానులకు మత్తెక్కించాలి కానీ...!, కౌన్సిలింగ్ ఇప్పిస్తాం : రాజేంద్ర ప్రసాద్

అభిమానులకు మత్తెక్కించాలి కానీ...!, కౌన్సిలింగ్ ఇప్పిస్తాం : రాజేంద్ర ప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో ద్వితీయ, తృతీయ శ్రేణి నటులు డ్రగ్స్‌ బారిన పడ్డారని సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఇండస్ట్రీలో డ్రగ్స్‌ బారిన పడిన వారందరికీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం కొత్తేమీ కాదు. చాలాకాలం నుంచే ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం ఉంది.

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, నిర్మాతలు తొలిసారి మీడియా సమావేశం పెట్టారు. పది, పదిహేను మంది వల్లే సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నవారి పేర్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఇప్పటికైనా వాళ్లు పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

Rajendra prasad respond on drugs case

లేకుంటే తరువాత జరిగే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయం లో నవదీప్, తరుణ్, హీరోయిన్లు చార్మి, ముమైత్‌ఖాన్, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యాం కే నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్నా, సుబ్బరాజు ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిని వారంలోగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం.

ఈ టాలీవుడ్ డ్రగ్ దందా కలకలం మీద రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. డ్రగ్స్ కేసులో కొంత మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు. సీనియర్‌ నటులెవరూ డ్రగ్స్‌ బానిసలు కాలేదని, కొందరు యువ నటులు తాము అనుకున్న స్థాయికి చేరకపోవడంతో డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని వెల్లడించారు. నటులు అభిమానులను అలరించి మత్తెక్కించాలి కానీ డ్రగ్స్‌కు బానిస కాకూడదని చెప్పారు రాజేంద్ర ప్రసాద్.

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
English summary
Senior Actor Rajendra prasad respond on drugs in Tollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu