»   » సిద్దార్ధ 'బావ'లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏమిటంటే...

సిద్దార్ధ 'బావ'లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్ధార్థ్ హీరోగా, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై రాంబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎంఎల్ కుమార చౌదరి 'బావ' అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బావగా సిద్దార్థ్ కనిపిస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్ అతని తండ్రిగా కీలకమైన పాత్ర చేస్తున్నారు. పల్లెలో క్రింద లుంగీ, పైన తలకట్టు కట్టి ట్రాక్టర్ నడుపుతూ కనపడే అచ్చ తెలుగు రైతు పాత్ర అని తెలుస్తోంది. సిద్దార్ధ బావగా అల్లరితనం, కొంటెతనం, చలాకీతనం కలగలిపిన పాత్రను పోషిస్తున్నారు. ఇక సిద్దార్ద, రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 4 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుంది. హీరోయిన్ గా ప్రణీత అనే అమ్మాయి పరిచయమవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu