For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజేంద్రప్రసాద్ కుమారుడి వివాహ శుభలేఖ(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్: నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఏకైక కుమారుడు బాలాజీ వివాహం...శివ శంకరి తో ఫిబ్రవరి 2 ఉదయం చెన్నైలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ పెళ్లి శుభలేఖలను తన సన్నిహితులైన సినిమా వాళ్లకు తన బంధువులకు పంపించటం జరిగింది. కుటుంబమంతా ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఆ శుభలేఖే మీరు ఇక్కడ చూస్తున్నది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  బాలాజి విషయానికి వస్తే... రాజేంద్రప్రసాద్ కుమారుడు బాలాజీ త్వరలో హీరోగా పరిచయమవబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నిధి ప్రసాద్ ఆయనను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు.

  Rajendra Prasad’s son wedding card

  రాజేంద్రప్రసాద్ విషయానికి వస్తే...

  ఆ నలుగురు చిత్రంతో మళ్లీ పామ్ లోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత మీ శ్రేయాభిలాషి మినహా చెప్పుకోతగ్గ పాత్ర చేయలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా జులాయి, మొగుడు వంటి చిత్రాల్లో చేసినా ఆయన ఇండిడ్యువల్ గా చేసి మెప్పించే పాత్ర పడలేదు. ఇప్పుడు ఓ తమిళ రీమేక్ లో ఆయనకు అలాంటి పాత్ర దొరికిందని తెలుస్తోంది. తమిళంలో నాజర్ చేసిన పాత్రను రాజేంద్రప్రసాద్ చేస్తున్నారని తెలుస్తోంది.

  వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఉన్న ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్ లో ఒకటైన ఉషాకిరణ్ మూవిస్ దర్శకుడు క్రిష్ కలిసి నిర్మాతగా ఓ చితం నిర్మిస్తున్నారు. రామోజీరావు గారు నిర్మించే ఈ చిత్రం ఓ తమిళ రీమేక్ అని సమాచారం. తమిళంలో నాన్న డైరక్టర్ విజయ్ రూపొందించిన ‘శైవం'కి ఇది రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం చూసిన క్రిష్...బాగా నచ్చి రామోజీరావు గారికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. రామోజీరావు గారు సైతం ఈ చిత్రం చూసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రకు రాజేంద్రప్రసాద్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు.

  'నాన్న‌' చిత్రంలో ఆత్మీయ నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్న సారా గుర్తుందిగా?.. ఆమె ప్రధాన పాత్రలో 'తలైవా' ఫేం ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శైవం'. తమిళంలో ఆ మధ్యన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి కితాబు అందుకుంది. ఇందులో సారా నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. విజయ్‌ కూడా మంచి విజయం దక్కిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తెలుగు వెర్షన్ లో కూడా ఆమెనే తీసుకునే అవకాసం ఉంది. తాత, మనవరాలి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో 'శైవం' తెరకెక్కించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేవలం ఓ కోడిపుంజు వేసి వదిలి, అందరినీ ఆశ్చర్యంలో పడేసారు.

  ఇందులో 'దైవతిరుమగల్‌' ఫేం బేబీ సారా నటించటం ప్లస్ అయ్యింది. నాజర్‌ ముఖ్యపాత్ర పోషించారు. నాజర్‌ కుమారుడు బాషా కూడా ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. 'శైవం' చిత్రాన్ని చూసిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ బ్యానరు నిర్మాత, నటుడు ఉదయనిధి.. ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.

  English summary
  Nata Kireeti Rajendra Prasad ’s son Gadde Balaji is entering to wedlock with Miss Siva Shankari on the 2nd of this February, 2015 in Chennai. This was an arranged marriage and , a grand reception shall follow on Feb 9 here in Hyderabad
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X