»   » ఒంటరిగా వేసేద్దామనుకున్నారు, నాగబాబు అండ: రాజేంద్రుడి స్పీచ్

ఒంటరిగా వేసేద్దామనుకున్నారు, నాగబాబు అండ: రాజేంద్రుడి స్పీచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో గెలు పొందిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నా నుండి అందరినీ దూరం చేసి, ఒంటరిని చేసి అభిమన్యుడిలా వేసాద్దామనుకున్నాను, కానీ నేను అర్జునుడి లాంటి వాడినని వారికి తెలియదు అన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతమైన తెలుగు వారి అందరి బిడ్డగా, అందరి ఇళ్లలో డివిడీ సీడీ రూపంలోఉన్న మీ రాజేంద్రప్రసాద్ కు...భగవంతుడు ‘మా' అద్యక్షుడి రూపంలో కొత్త బాధ్యతను అందివ్వడం జరిగిందని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఎన్నికల అంశం ఏది ఎలా జరిగింది అనేది మీడియా మిత్రులు గత కొన్ని రోజులుగా మీకూ(ప్రజలకు) చెబుతూనే ఉన్నారు, మాకంటే మీకే ఎక్కువ తెలిసేట్లుగా ఈ ఎపిసోడ్ మొత్తం మీ కళ్ల ముందు పెట్టారన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో....ఈ గెలుపు మీకే అంకితం(ప్రజలకు) అన్నారు. మా అసోసియేషన్లో ఉన్నది 700 మందే అయినా, 394 మందే ఓటేసినా..... ప్రతి తెలుగు ఇంట్లోనూ...అయ్యో! రాజేంద్రప్రసాద్ కు ఏమౌతుందో అని ఎదురు చూసారు. నా గెలుపు కోసం ఎదురు చూసారు. మీ ఆశీర్వాదం ఉండటం వల్లే ఈ నాడు నేను విజయం సాధించాను అని రాజేంద్రప్రసాద్ అన్నరు.

Rajendra Prasad speech about MAA ealections

నేను, కాదంబరి కిరణ్, శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ ఓ గుడిలో ఆర్టిస్టులకు సేవ చేద్దామని ఓట్టువేసుకుని రంగంలోకి దిగా. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నన్ను....భయ పెట్టారు, ప్రలోభ పెట్టారు, దబాయించారు. ఎన్నో పరీక్షలు దాటుకుని గెలించాం. ఇది ధర్మయుద్దం. వీలైనన్ని అపవాదులు నాపై వేసారు. నాకు మద్దతుగా ఉన్న వాళ్లని భయ పెట్టి నాకు దూరం చేసారు. ఒంటరిగా చేసారు. ఒంటరినైన తర్వాత భిమన్యుడి లాగా ఏసేద్దాం అనుకున్నారు. అర్జునుడు ఒక్కడు చాలు అనే విషయం వారికి తెలియదు.

ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు మద్దతుగా ఉన్న నాగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా నుండి కొందరు దూరం అవుతుంటే....పిరికి వాళ్లు వెంట ఉంటే రాజు ముందుకు కదలేడు అని ధర్యం చెప్పి వెన్ను తట్టారు. నా గెలుపుకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధ్యవాదాలు. నా ప్రాణాలు పణంగా పెట్టయినా సరే నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను అన్నారు. మా అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం ‘మా’ డబ్బుతో టీ కూడా తాగను అన్నారు రాజేంద్రప్రసాద్.

English summary
Rajendra Prasad speech about MAA ealections.
Please Wait while comments are loading...