»   » షూటింగ్‌లు లేకుండా రజనీ ఏం చేస్తున్నారు?

షూటింగ్‌లు లేకుండా రజనీ ఏం చేస్తున్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ స్టార్ నుంచి ఆలిండియా సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్....షూటింగ్ సమయంలో బిజిబిజిగా ఎక్కడెక్కడో గడుపుతుంటాడు. అయితే షూటింగులు లేనప్పుడు మాత్రం సినిమా వాతావరణానికి పూర్తి దూరంగా ఉంటుంటారాయన. తన కుటుంబం, ఇద్దరు కూతుర్లతో ఎక్కువ సమయం గడుపుతుంటారు. మనవళ్లతో ఆనందాన్ని ఆహ్వాస్వాదిస్తారు.

ఆయన దిన చర్య ఏమిటంటే...

ఉదయం ఐదున్నర గంటలకే నిద్రలేచిన రజనీ..ఆరు గంటల నుంచి ఓ అరగంట పాటు వాకింగ్ చేసి, అనంతరం గంట పాటు యోగా చేస్తారు. తర్వాత తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఆఫీసులో గడిపి ఫైళ్లను పరిశీలిస్తారు. 9 గంటలకు టిఫిన్ చేస్తారు. చాలా లైట్ ఫుడ్ తీసుకుంటారు. రెండు బ్రెడ్ ముక్కలు లేదా ఇడ్లీలు, టీ తీసుకుంటారంతే. 11 గంటల వరకు రెడీ అయి తన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులతో గంట గంటన్నర పాటు చిట్ చాట్ చేస్తూ సరదాగా దగడుపుతారు. అనంతరం తన పెద్దల్లుడు ధనుష్ ఇంటి వెళతాడు. అప్పటికే కూతురు ఐశ్వర్య రజినీకి మంచి డైట్ తో కూడిన ఫుడ్ రెడీ చేసి పెడుతుంది. 12.30 గంటలకు లంచ్ పూర్తి చేసి మనవడితో ఆడుకుంటాడు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పడుకుంటారు. అనంతరం పోసన్ గార్డెన్ వెళ్లి ఉల్లాసంగా గడుపుతారు. 6 గంటలకు తన స్సేహితులను కలిసి అటునుంచి అటే 7 గంటలకు మెడికల్ చెకప్ కు వెళతారు. 8 గంటలకు లైట్ గా డిన్నర్ కానిచ్చి కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తూ గడుపుతుంటారు. రాత్రి 9.30 గంటలయిందంటే అంతా ప్యాపకప్. ఆ తర్వాత ఆయన్ను ఎవరూ డిస్ట్రబ్ చేయరు. అలా సాగుతుంది రజినీ దిన చర్య.

English summary
Rajinikanth daily schedule simple and perfect. He spends more time for his family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu