For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "కాలా" కూడా వెనకడుగే, రజినీ భారీ ఫ్లాప్ భయం ముంగిట ఉన్నాడా?: సినీ విశ్లేషకుల అభిప్రాయం

  |

  సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా తన ప్రతీ సినిమాకీ కనీసం సంవత్సరం.. మామూలుగా అయితే రెండేళ్ళు గ్యాప్ తీసుకుంటాడు. దాదాపుగా తలైవా సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావటం వల్ల, నిర్మాణ వ్యయమే కాదు టైమ్ కూడా ఎక్కువే తీసుకుంటాయి. అయితే ఈ సారి మాత్రం అనుకోకుండా రెండు సినిమాలు తక్కువ సమయం లోనే విడుదలయ్యే పరిస్తితి వచ్చింది.

  Rajinikanth Fans Not Happy With 2.0 ఛీ..! రోబో 2.0 మరీ ఇంత చెత్తగానా?
   2.0 కంప్లీట్ అవక ముందే

  2.0 కంప్లీట్ అవక ముందే

  ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0 మూవీ కంప్లీట్ అవక ముందే కబాలి సినిమా తీసిన పా. రంజిత్ దర్శకత్వంలో మరోసినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో 70ల నాటి ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో కాలా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రెండూ దాదాపు కొన్ని నెలల వ్యవదిలోనే విడుదలకు సిద్దమయ్యాయి.

   అత్యంత భారీ బడ్జెట్ తో

  అత్యంత భారీ బడ్జెట్ తో

  శంకర్ 2.0 మూవీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటంతో ఆ సినిమా షూటింగ్ అనుకున్న దానికన్నా లేటయింది. మూవీ ఆడియోను కొద్ది రోజుల క్రితమే దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా జనవరికి థియేటర్లకు వస్తుందని నిన్న మొన్నటి దాకా చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు మళ్ళీ ఆ తేదీ కూడా వాయిదా పడిందని మాటలు వినిపిస్తున్నాయి.

   సంక్రాంతి టైమ్ కి రావాల్సి ఉంది

  సంక్రాంతి టైమ్ కి రావాల్సి ఉంది

  2.0 యూనిట్ వాటిని ఖండించడం గానీ.. లేదా ఎప్పుడొస్తుందో చెప్పడం కూడా చేయకపోవటంతో వాయిదా వార్తలు నిజమే అయుండొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. ఇక రోబోని కాసేపు పక్కన పెడితే కబాలీ కాంబోలో వస్తున్న "కాలా" ముందు అనుకున్న దానిప్రకారమైతే ఈ సంక్రాంతి టైంకి థియేటర్లకు రావాల్సి ఉంది..

  ఖచ్చితంగా చెప్పటం లేదు

  ఖచ్చితంగా చెప్పటం లేదు

  కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ సమయానికి వచ్చే పరిస్థితి లేదు ఈ మేరకు కాలా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. కాలా రావటానికి సమయం పడుతుందని తేల్చి చెప్పింది యూనిట్. అయితే ఈ సినిమా కూడా ఎప్పుడూ అన్న తేదీని మాత్రం ఖచ్చితంగా చెప్పటం లేదు.

   కబాలీ తప్ప అంత పెద్ద హిట్ ఏమీ పడనే లేదు

  కబాలీ తప్ప అంత పెద్ద హిట్ ఏమీ పడనే లేదు

  కానీ రెండు సినిమాలు ఒకే సారి గనక వస్తే ఏదిముందు రిలీజై కాస్త అటూ ఇటూ అయినా ఆ ప్రభావం రెండో సినిమా మీద పడొచ్చు అన్న అభిప్రాయం ఉంది. ఇదైతే తీసిపారేయలేని నిజం. గత కొన్నేళ్ళుగా రజినీకి కబాలీ తప్ప అంత పెద్ద హిట్ ఏమీ పడనే లేదు.

   కాలా కంటే రోబో 2.0 మీదనే ఎక్కువ అంచనాలు

  కాలా కంటే రోబో 2.0 మీదనే ఎక్కువ అంచనాలు

  కేవలం తన స్టామినా మీద వచ్చిన వసూళ్ళే తప్ప మరీ విజృంబించిన సినిమా "కబాలీ" తప్ప ఇంకోటి లేదు,పైగా విక్రమసింహ, లింగా లాంటి భయంకరమైన డిజాస్టర్లే ఉన్నాయి. నిజానికి ఇప్పుడు కాలా కంటే రోబో 2.0 మీదనే ఎక్కువ అంచనాలూ, ఎక్కువ ఆశలూ ఉన్నాయి, దీనికి ముందు చాలా అంచనాలతో వచ్చి నిరాశ పరిచిన "కబాలీ" మళ్ళీ అదే కాంబినేషన్ తో వస్తున్న "కాలా" మీద అనుమానాలనే కలిగిస్తోంది.

  హ్యూమా ఖురేషీ

  హ్యూమా ఖురేషీ

  మరి ఏది ముందో ఏది వెనకో గానీ రజినీ మళ్ళీ పరాజయాన్ని చూడటం అటు రాజకీయాల్లోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నఫ్ఫుడు మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. కాలా సినిమా తో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ తొలిసారి సౌత్ లో అడుగు పెట్టబోతోంది.

  ఈశ్వరీరావు

  ఈశ్వరీరావు

  అయితే ఈ సినిమాలో రజనీ భార్య పాత్రలో నటిస్తోంది మాత్రం సీరియల్ అండ్ సినిమా నటి ఈశ్వరీరావు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ స్వయంగా కాలా సినిమా నిర్మిస్తున్నారు.

  English summary
  Speaking to reporters in Chennai, Rajinikanth confirmed that Pa Ranjith directed Kaala would not release in January next year before his other big film, 2.0.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X