»   » రజనీకాంత్ వ్యవహారం చూసి ఇండస్ట్రీ షాక్!

రజనీకాంత్ వ్యవహారం చూసి ఇండస్ట్రీ షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసారు. ఒక రకంగా ఆయన స్పీడు చూసి అంతా షాకయ్యారు. ఈ మధ్య వయసు సహకరించని కారణంగా రజనీకాంత్ స్లో అయిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు చాలా కాలం పాటు సెట్స్ పైనే ఉండి పోయాయి. సినిమా సినిమాకు మధ్య విడుదల సమయం కూడా ఎక్కువగానే తీసుకుంది.

అయితే తాజాగా రజనీకాంత్ నటిస్తున్న 'లింగా' చిత్రం మాత్రం పూర్తి భిన్నంగా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రెండు నెలల క్రితం మైసూరులో షూటింగ్ ప్రారంభమైంది. ఈచిత్రం ప్రస్తుతం రాజమోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ వయసులో రజనీకాంత్ స్పీడు చూసి అంతా ఆశ్చర్యపడుతున్నారు.

Rajinikanth ‘Lingaa’ shooting 75 percent completed

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో విలన్ గా ఇప్పటికే జగపతిబాబు ఉండగా, మరొక విలన్ గా దేవగిల్ నటిస్తున్నారని సమాచారం. ఇండిపెండెన్స్ కు ముందు జరిగే ఫ్లాష్ బ్యాక్ లో దేవగిల్ కనిపిస్తారని చెప్తున్నారు.

'లింగా'కు రత్నవేలు కెమెరాను నిర్వహిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బ్రిటిష్ నటి లారెన్ జె ఇర్విన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఆయన ఈ చిత్రంలో రెండు పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.ఈ చిత్ర కథ ప్రస్తుతం కొంత, ప్లాష్‌బ్యాక్‌లో కొంత ఉంటుంది. ప్రస్తుత కథలో జిల్లా కలెక్టర్‌గా ప్లాష్‌బ్యాక్‌ నేపథ్యంలో ఓ వైవిధ్యమైన పాత్రలోనూ ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం.

English summary
Currently, Rajinikanth is shooting for ‘Lingaa’ in Hyderabad and 75 percent of the film has been completed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu