»   » హాట్ న్యూస్: మణిరత్నం దర్శకత్వంలో సూపర్ స్టార్ ఖరారు

హాట్ న్యూస్: మణిరత్నం దర్శకత్వంలో సూపర్ స్టార్ ఖరారు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించనున్న కొత్త చిత్రం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రస్తుతం చేస్తున్న విక్రమసింహా తర్వాత రజనీకాంత్‌ నటించనున్న చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నట్లు తమిళ సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం . కొత్త సినిమాకు సంబంధించి వీరిద్దరూ కలిసి చర్చించుకున్నట్లు, కడల్‌ షూటింగ్‌ను పూర్తి చేసిన వెంటనే మణిరత్నం రజనీకాంత్‌ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. వీరిద్దరి కలయికలో 1991లో వచ్చిన 'దళపతి' ఘనవిజయం సాధించి రజనీకాంత్‌ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలవటం విశేషం.

  ఈ మేరకు మణిరత్నం ఓ స్టోరీ లైన్ ని రజనీకాంత్ కి చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. తమిళంలో భారీ చిత్రాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధ ఈ చిత్రం నిర్మించనుంది. రజనీకాంత్ కి సరపడ మాస్ ఇమేజ్ ని, తనదైన క్లాస్ స్టైల్ లో మరోసారి ఆవిష్కరించనున్నారని అంటున్నారు. ఇక మణిరత్నం చిత్రం అనగానే మార్కెట్ వర్గాల్లో అప్పుడే కలకలం మొదలైంది. ఓ రేంజిలో బిజినెస్ జరుగుతుందో అని ట్రేడ్ లో లెక్కలు వేసుకుంటున్నారు.

  ఇక తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన 'విక్రమసింహా'సంక్రాంతిరోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకన్నా ముందే 'శివాజీ 3డీ' రజనీ పుట్టినరోజు కానుకగా డిసెంబరు 12న థియేటర్లలో సందడి చేయనుంది.రజనీకాంత్‌ నటించిన 'విక్రమసింహ'ను 12-12-12 అనే అరుదైన తేదీన తెరపైకి తీసుకురావాలనుకొన్నారు.

  తేదీలో అన్నీ పన్నెండులు ఉండటమే కాదు... ఆ రోజునే రజనీ జన్మదినం. ఈ సందర్భంగా 'విక్రమసింహ'ను విడుదల చేస్తే క్రేజ్‌ వస్తుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే ఆ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వాయిదా వేశారు. అయితే రజనీ పుట్టిన రోజున ఆయన సినిమా ఒకటి విడుదలవుతోంది. అదేమిటంటే శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'శివాజి'. 2007లో వచ్చిన ఆ చిత్రానికి త్రీడీ హంగులు అద్దారు. ఇటీవలే ఆ సాంకేతిక కార్యక్రమాలు ముగిశాయి. చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎమ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ''రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న శివాజి త్రీడీని తెరపైకి తీసుకొస్తున్నాము''అన్నారు. ఇందులో శ్రియ కథానాయికగా నటించింది. త్రీడీకి అనుగుణంగా చిత్ర నిడివిని కొంత వరకూ తగ్గించారు.

  English summary
  Learn from sources in ace filmmaker Mani Ratnam’s office that the Superstar Rajinikanth has initiated talks with Mani on a new project. Mani Ratnam, who is currently in the process of releasing the audio for his upcoming magnum opus, Kadal, did one film, Dhalapathi, with Rajinikanth two decades ago, which was set in a contemporary milieu at the time of its release and was a critical and commercial success.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more