»   » దుమ్ము రేపే.. దమ్మున్న పాత్రలో రజనీకాంత్.. ముంబై గ్యాంగ్‌స్టర్‌గా.. 161 చిత్రంతో బాషా రిపీట్!

దుమ్ము రేపే.. దమ్మున్న పాత్రలో రజనీకాంత్.. ముంబై గ్యాంగ్‌స్టర్‌గా.. 161 చిత్రంతో బాషా రిపీట్!

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాషా.. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇప్పటికి కూడా క్రేజే. బాషా పేరు వింటే సినీ అభిమానులకు ఇప్పటికీ ఓ ఝలక్. బాషా లాంటి మరో గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరపై ఆవిషృతమవుతున్నదంటే అభిమానులకు పండుగే.

  Rajinikanth

  రోబో తర్వాత రజనీకాంత్ నటించే చిత్రం మాఫియా డాన్ పాత్ర అని చెప్పుకొంటున్నారు. రోబో 2.0 తర్వాత రజనీకాంత్ నటించే 161వ చిత్రం దర్శకుడు పా రంజిత్‌దే కావడం విశేషం. ఈ చిత్రం కూడా ఓ గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం.

  కబాలి సెన్సేషన్..

  కబాలి సెన్సేషన్..

  సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన కబాలి సంచలన చిత్రంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఆదరించకపోయినా కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాసింది. మలేషియాలోని భారత సంతతికి చెందిన ఓ నాయకుడు వేలు నాయకర్ కథనే కబాలి‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

  161వ సినిమా మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా

  161వ సినిమా మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా

  తలైవర్ రజనీకాంత్ నటించే చిత్రం మిర్జా హాజీ మస్తాన్ జీవిత కథ అనే వార్త వినిపిస్తున్నది. మస్తాన్ హైదర్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్ తమిళనాడుకు చెందిన ముస్లిం మతస్తుడు. తమిళ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం హాజీ మస్తాన్‌కు ఉంది.

  హాజీ మస్తాన్ కథ ఇదే..

  హాజీ మస్తాన్ కథ ఇదే..

  హాజీమస్తాన్ ముంబైలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. స్మగ్లింగ్, సినిమాలకు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హవాలా కార్యక్రమాలతో ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని 1926 రెంయి 1994 వరకు ఏలిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ మాఫియా సంబంధాలతో హాజీ మస్తాన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు.

  పేదరికం నుంచి విలాసవంతమైన జీవితం వైపు

  పేదరికం నుంచి విలాసవంతమైన జీవితం వైపు

  కడు పేదరికంలో పుట్టిన హాజీ మస్తాన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపాలనే కోరిక చిన్నతనం నుంచే ఉందని చెప్తుంటారు. పేదరికం కారణంగా ఎదురైన ఆటుపోట్లతో ఎలాంటి పరిస్థితులైన ఎదురించే స్థాయికి వెళ్లాడనే పోలీసులు వెల్లడిస్తుంటారు. హాజీ మస్తాన్ బలమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వెనుక తమిళుడైన వరదరాజన్ ముదలియార్ హస్తం, మద్దతు ఉందని పేర్కొంటారు.

  రజనీకాంత్ తప్పా మరెవరూ..

  రజనీకాంత్ తప్పా మరెవరూ..

  భాషా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇలాంటి ప్రభావవంతమైన కోణాలు ఉన్న మాఫియా గ్యాంగ్ లీడర్ పాత్రను సూపర్‌స్టార్ రజినీకాంత్ తప్పా మరెవరూ పోషించలేదనే భావన ఏర్పడింది. హాజీ మస్తాన్ ఆహార్యం రజనీ పక్కాగా సూట్ అవుతాయనే సినీ వర్గాల అభిప్రాయం. హాజీమస్తాన్ తెల్లటి లాల్చీ, షూస్ ధరించి మెర్సిడెజ్ బెంజ్ కారులో ప్రయాణించడం, ఖరీదైన సిగరెట్లు తాగడం లాంటి అంశాలతో కూడిన పాత్రను పోషించడం రజనీకాంత్‌కే సాధ్యమనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.

  రోబో2.0 షూటింగ్ పూర్తి

  రోబో2.0 షూటింగ్ పూర్తి

  సంచలన దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ప్రస్తుతం రజనీకాంత్ రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా తర్వాత తన 161వ చిత్రంపై తలైవా దృష్టిపెట్టినట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మే నుంచి ప్రారంభం కానున్నది.

  రజనీ డబుల్ రోల్..

  రజనీ డబుల్ రోల్..

  పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. సీనియర్ నటి ఖుష్బూ ఓ పాత్రలో నటించనున్నారనే వార్త బయటకు వచ్చింది. నిజంగా 161 చిత్రం హాజీ మస్తాన్ జీవిత కథే అయితే అభిమానులకు పండుగే. రజనీ స్టైల్, యాక్షన్‌కు సరితూగే పాత్ర కావడం ఖాయం.

  హాజీ మస్తాన్ సన్నిహితుడిగా కమల్

  హాజీ మస్తాన్ సన్నిహితుడిగా కమల్

  ఈ కథలో భాగమైన వరదరాజన్ ముదలియార్ పాత్రను రజనీ స్నేహితుడు కమల్ హాసన్ 1987లో పోషించాడు. ముదలియార్ పాత్రను నాయకుడు చిత్రంలో కమల్ పోషించిన సంగతి తెలిసిందే. ముదలియార్ అండతో మాఫియా సామ్రాజ్య అధినేతగా ఎదిగిన హాజీ మస్తాన్ పాత్రను 2017లో రజనీ పోషించడం విశేషం.

  భాషా సంచలనం రిపీట్

  భాషా సంచలనం రిపీట్

  గతంలో ముంబై మాఫియాను గడగడలాడించిన గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా వచ్చిన భాషా చిత్రం సంచలన విజయం సాధించింది. బాషాకు కొనసాగింపుగా, ఆ చిత్రాన్ని పోలిన విధంగా ఉన్న హాజీమస్తాన్ కూడా ప్రజాదరణ పొందుతుందడం ఖాయం. బాషా సంచలనం మళ్లీ రిపీట్ కావడం తథ్యం అనే వాదన వినిపిస్తున్నది.

  English summary
  The yet to be untitled 161st movie of Thalaivar Rajinikanth is said to be based on Mirza Haji Mastan. Mastan Haider Mirza, fondly known as Haji Mastan was a Tamil Muslim. Mastan settled down in Mumbai (Erstwhile Bombay), who was known more for his smuggling, finance assistance for films and real estate activities. Born and brought up in a poor family, Haji Mastan dreamt of making it big in order to lead a luxurious life.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more