వీడియా : రజనీ 'కబాలి' కాపీ కొట్టారు,బాలీవుడ్ స్టార్ ఆరోపణ, అసలు నిజం
ముంబై : బాలీవుడ్ చిన్న సినిమాల స్టార్ ఇర్ఫాన్ ఖాన్ తన చిత్రం 'మదారి' పోస్టర్ ని రజనీకాంత్ తాజా చిత్రం కబాలి వారు కాపీ కొట్టారంటూ ఆరోపించటం ఇప్పుుడ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయన తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ ఈ విషయం ప్రస్దావించారు. అంతేకాకుండా మేం చిన్న సినిమావాళ్లం. అంత పెద్ద సినిమా తీస్తున్నవాళ్లు మా కాపీకొట్టారు. అయినా ఫర్వాలేదు. నాకు నిరసన లేదు. అందరూ ఆ సినిమా చూడండి అన్నారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.
ముంబైలో జరిగిన తన చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాను ఓ చిన్న చిత్రాన్ని నిర్మించామని, తమ పోస్టరును, రజనీ హీరోగా తయారైన కబాలీ చిత్ర పోస్టరును చూపిన ఆయన, రెండిటి పోలికలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ..''మేమేదో చిన్న సినిమాలు తీసిన వాళ్లం.. అంత పెద్ద సినిమా తీస్తున్న వాళ్లు మా పోస్టర్ ను కాపీ కొట్టారు. అయినా ఓకే ,ఫర్వాలేదు, ఆ సినిమా పట్ల మాకెలాంటి నిరసనా లేదు. అందరూ ఆ సినిమాను చూడండి, ఎంజాయ్ చేయండి...'' అన్నాడు.
ఈ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మన తెలుగు,తమిళంలో కూడా సినిమాలు చేసారు. ఆయన ఇంతమాట అనటానికి కారణం. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టులు ప్రచురితం అవుతూ వస్తూండటమే.
Video Courtesy :Viral Bhayani
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే... కాగా, మదారీ చిత్రం పోస్టర్ అధికారికంగా విడుదలైన పోస్టర్ అని, కబాలీ పోస్టర్ ఎవరో అభిమాని తయారు చేసి ఆన్ లైన్ లో పెట్టినదే తప్ప, అధికారికంగా నిర్మాతలు విడుదల చేసింది కాకపోవటమే. ఈ విషయాన్ని రజనీ అభిమానులు గుర్తించాలని వ్యాఖ్యానించారు. ఆ రెండు పోస్టర్లనూ మీరు కరెక్టుగా దగ్గర పెట్టి చూస్తే ఆ తేడా గమనించవచ్చు.


Click it and Unblock the Notifications











