»   »  రజినీకి ఆరోగ్యం బానే ఉంది, అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు: ఈ వీడియో చూడండి

రజినీకి ఆరోగ్యం బానే ఉంది, అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు: ఈ వీడియో చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీ కాంత్ ఉన్నట్టుండి అమెరికా ప్రయాణం అయ్యినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా త్వరలోనే రోబో2 సినిమా షూటింగ్ కు ఉక్రెయిన్ వెళ్ళాల్సి ఉండగా హఠాత్తుగా అమెరికా ప్రయాణం జరపడంతో ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అప్పుడప్పుడు అనుకోకుండా రజనీకాంత్ అనారోగ్యానికి గురౌతుండటం తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు అనారోగ్యం బారిన పడిన రజనీకాంత్ ఆ తర్వాత అమెరికాలోనే చికిత్స తీసుకొని ఆరోగ్యంగా రావడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మధ్యనే రాజకీయ ప్రవేశం, అభిమానులతో మీటింగ్ లూ, రోబో 2.0 షూటింగ్ అంటూ ఉన్న రజినీ హఠాత్తుగా అమెరికా వెళ్ళటం తో అభిమానుల్లో మళ్ళీ కంగారు మెదలయ్యింది.

అమెరికాలో ట్రీట్‌మెంట్

అమెరికాలో ట్రీట్‌మెంట్

కబాలి మూవీ షూటింగ్ తర్వాత అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళు అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకున్న రజినీకాంత్ మళ్ళీ చెకప్ కోసం అమెరికా వెళ్ళాడని ఓ వార్త దావానంలా వ్యాపించింది. శంకర్ తెరకెక్కిస్తోన్న రోబో సీక్వెల్ షూటింగ్ లో రజినీ ఇటీవలే జాయిన్ కాగా కొంత టాకీ పార్ట్ పూర్తి చేశారు.

ఉక్రెయిన్‌లో

ఉక్రెయిన్‌లో

ఉక్రెయిన్‌లో కూడా సాంగ్స్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. అయితే ఉన్నట్టుండి రజినీ చెకప్ కోసం అమెరికా వెళ్ళాడనే వార్త బయటకు రావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. రజినీతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కొందరు కుటుంబ సభ్యులు అమెరికా వెళ్ళారని సమాచారం.

మామూలు మెడికల్‌ చెకప్‌ కోసమే

మామూలు మెడికల్‌ చెకప్‌ కోసమే

ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కొంత ఆందోళన రేపింది. అయితే, రజనీకాంత్‌ మామూలు మెడికల్‌ చెకప్‌ కోసమే అమెరికా వెళ్లారు. అమెరికాలో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అంతేకాదు తీరిక సమయాన్ని ఆస్వాదిస్తున్నారు కూడా. అందుకు ప్రూఫ్‌ ఇదేనంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఫెరారీలో ప్రయాణిస్తూ

ఈ వీడియోలో రజనీ ఫెరారీలో ప్రయాణిస్తూ సెల్ఫీ తీసుకున్నట్టు కనిపిస్తోంది. నవ్వుతూ రజనీ చాలా హుషారుగా ఈ వీడియోలో కనిపించారు. అన్నట్టు రజనీ తీసుకున్న తొలి సెల్ఫీ వీడియో ఇదేనని తెలుస్తోంది. ఈ వీడియోలో రజనీ డ్రైవింగ్‌ సీటులో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతూ 'నేను రెడ్‌ బటన్నీ ప్రెస్‌ చేస్తే.. వీడియో వస్తుంది కదా' అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

English summary
A selfie video of Rajinikanth, who is currently in the US, has gone viral on several social media platforms.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu