For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ ఫ్యాన్స్ కంగారు పడొద్దు, '2.0' రిలీజ్ మీద నిర్మాత ప్రకటన

  By Bojja Kumar
  |

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న '2.0' చిత్రం విడుదలపై నెలకొన్న అయోమయానికి నిర్మాతలు తెరదించారు. ఇప్పటికే సినిమా ఓసారి వాయిదా పడటంతో ఆందోళనలో పడ్డ అభిమానులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు నిర్మాతలు.

  తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోందని, ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేశారు.

   ఏదీన విడుదలయ్యే అవకాశం ఉంది?

  ఏదీన విడుదలయ్యే అవకాశం ఉంది?

  ఈ చిత్రాన్ని తమిళ న్యూఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 13, 2018వ తేదీకి కాస్త అటు ఇటుగా విడుదల చేసే అవకాశం ఉంది.

   450 కోట్ల బడ్జుట్, మూడేళ్ల కష్టం

  450 కోట్ల బడ్జుట్, మూడేళ్ల కష్టం

  2.0 సినిమా కోసం దర్శకుడు శంకర్ దాదాపు మూడేళ్లుగా కష్టపడుతున్నారు. 2015 జనవరి లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' మూవీ విడుదల తర్వాత తన పూర్తి సమయాన్ని ‘2.0' సినిమా కోసమే కేటాయించారు. సినిమాలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కేర్‌తో టేకప్ చేస్తూ వచ్చారు. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

  కీలక పాత్రలు

  కీలక పాత్రలు

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

   ఆలస్యం అందుకే...

  ఆలస్యం అందుకే...

  ‘2.0' మూవీ ఇండియాలోనే హై బడ్జెట్ మూవీ. దాదాపు రూ. 450 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాలో తప్పులు వెతికి అవహేళన చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇంత ఖర్చు పెట్టి అలాంటి మాటలు పడటం ఎందుకు? అనే ఉద్దేశ్యంతోనే సినిమా విడుదల కాస్త ఆలస్యమైనా మంచిదే.... పర్‌ఫెక్ట్ మూవీ ప్రేక్షకులకు చూపించాలనేది ఉద్దేశ్యంలో శంకర్ ఉన్నారు. అందుకే పోస్టు ప్రొడక్షన్లో గ్రాఫిక్స్ పరంగా చాలా కరెక్షన్స్ చేస్తున్నారు.

   అక్షయ్ ద్వారా బాలీవుడ్లో భారీగా మార్కెటింగ్

  అక్షయ్ ద్వారా బాలీవుడ్లో భారీగా మార్కెటింగ్

  అక్షయ్ ద్వారా బాలీవుడ్లో భారీగా మార్కెటింగ్ ‘2.0' మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారా ఈ సినిమాకు ఉత్తరాదిన భారీ కలెక్షన్స్ రాబట్టాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ సినిమా బాహుబలి రికార్డులతో పాటు ఇతర బాలీవుడ్ సినిమాల రికార్డులను ఏ మేరకు బద్దలు కొడుతుందో చూడాలి.

  English summary
  It is known that Superstar Rajinikanth, Great Director Shankar's 'Robo' created a worldwide sensation back in the year 2010. This sensational combination is back again for '2.0' the sequel of 'Robo'. Bollywood star Akshay Kumar will be seen as Villain while Amy Jackson as Heroine. With 'Lyca Productions' onboard, '2.0' is being made with a budget of 450 crores, High technical values, for the first time in 3D in India, On par with Hollywood standards... All these skyrocketed the expectations about '2.0' among audiences. Shooting part has been completed. Film is currently in post-production stages. Lyca Productions Creative head Raju Mahalingam said that they are planning to release '2.0' Worldwide in April, 2018 in a grand manner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X