»   » చూస్తూ ఊరుకోం , ఎంత దమ్ముంటే మా గడ్డపై సినిమా అలా తీస్తాడు...??

చూస్తూ ఊరుకోం , ఎంత దమ్ముంటే మా గడ్డపై సినిమా అలా తీస్తాడు...??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి మూవీ షూటింగ్‌కి వ్యతిరేకంగా కర్నిసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పద్మావతి చిత్రంలో చారిత్రాత్మక అంశాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించిన కర్నిసేన కార్యకర్తలు..జైగఢ్ కోట వద్ద జరుగుతున్న షూటింగ్‌ను అడ్డుకున్నారు. రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.సంజయ్‌లీలా బన్సాలీ ని చెంపదెబ్బలు కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. ఘటన జైగఢ్ కోట వద్ద జరిగింది. దాడితో సినిమా టీం మొత్తం షాక్‌కు గురైంది. సినిమాలో రాజ్‌పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపించారు.

ఈ ఘటన పై బాలీవుడ్ నుంచి కూదా పెద్ద స్థాయిలోనే నిరసన చెలరేగింది. ఒక దర్శకున్ని అంత పాశవికంగా కొట్టటం పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తప్పుపట్టారు. ట్విట మొత్తం సినీ ప్రముఖుల ట్వీట్లతో నిండిపోయింది. సంజయ్ లీలాబన్సాలీకి మద్దతుగా తామంతా ఉన్నామని బాలివుడ్ మొత్తం ఏక కంఠం తో సంజయ్ కి బరోసా నిచ్చింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడ దాడికి పాల్పడ్డ రాజ్‌పుత్ సేన మాత్రం తమ చర్యలు సరైనవేనంటూ సమర్థించుకుంది.

Rajput Karni sena's Lokendra Singh Kalvi blames Sanjay Leela Bhansali

'పద్మావతి' సినిమా షూటింగ్ సెట్‌లో దర్శకుడు సంజ్‌య్‌లీలా బన్సాలలీపై జరిగిన దాడిని రాజ్‌పుత్ సేన సమర్థించుకుంది. బన్సాలీపై దాడి సబబేనని, ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలేనని పేర్కొంది. బన్సాలీపై దాడి విషయంలో జరుగుతున్న రాద్ధాంతంపై రాజ్‌పుత్ కర్ణిసేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వి ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. సంజయ్‌కు చరిత్రను వక్రీకరించి సినిమా తీయడమే, ఆయనకు ఎంత దమ్ముంటే తమ గడ్డపై తమ చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్మనీలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఆయన సినిమా తీయగలడా? అని ప్రశ్నించారు.

చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకునే ప్రశ్నేలేదన్నారు. 'పద్మావతి' సినిమాలో రాజ్‌పుట్‌ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆయన తెసిన 'జోధా అక్బర్'లోనూ జోధాబాయి చరిత్రను కూడడా ఇలాగే వక్రీకరించాడనీ అందుకే అతను చేసిన, చేస్తున్న తప్పులకి శిక్ష విధించాలనీ, ఆయనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే దాడి చేసినట్టు లోకేంద్ర వివరించారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై జరిగిన దాడిని బాలీవుడ్ ఖండించింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అధ్యక్షుడు విక్రంభట్ మాట్లాడుతూ క్రియేటివ్ కళాకారుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయన్నారు.సంజయ్‌కు బాలీవుడ్ మొత్తం బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

English summary
Can Sanjay Leela Bhansali make a film against Hitler in Germany, questions Rajput Karni Sena founder Lokendra Singh Kalvi
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu