»   » నాగ్ మెంటలిస్ట్, సమంత దెయ్యం.... (రాజుగారి గది 2 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్)

నాగ్ మెంటలిస్ట్, సమంత దెయ్యం.... (రాజుగారి గది 2 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున హీరోగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ రాజు గారి గ‌ది 2. పి.వి.పి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.

ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'రాజుగారి గది 2' మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సెప్టెంబర్ 20వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.

మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున

ఈ చిత్రంలో నాగార్జున మెంటలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు. తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ.... ఇందులో మెంటలిస్టు పాత్ర చేస్తున్నాను. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిశాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ ఉంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది.

మాయలు చేసే పాత్ర కాదు

మాయలు చేసే పాత్ర కాదు

మెంటలిస్టు అంటే మాయలు, మ్యాజిక్ చేయడం ఏమీ ఉండదు. ఒక పది ప్రశ్నలు అడిగి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు. అదేమీ మ్యాజిక్‌ కాదు, అబ్జర్వేషన్‌ పవర్స్‌ చాలా ఎక్కువ. మిర్రర్‌ మెమరీ వుంటుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగింది వాళ్ళ మెమరీలో సేవ్‌ అయిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కంప్యూటర్‌లోలా దాన్ని బయటికి తీస్తారు. ఒరిజినల్‌గా ఒక మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ని పట్టుకొని తీశారు అని నాగార్జున తెలిపారు.

దెయ్యం పాత్రలో సమంత

దెయ్యం పాత్రలో సమంత

ఈ చిత్రంలో సమంత దెయ్యం పాత్రలో కనిపించబోతోంది. త్వరలో నాగార్జున కోడలు కాబోతున్న సమంత.... నాగార్జునతో కలిసి ‘మనం' తర్వాత చేస్తున్న సినిమా ఇదే.

రాజుగారి గది 2

నాగార్జున‌, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ - దివాక‌ర‌న్, మ్యూజిక్ - త‌మ‌న్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్ర‌కాష్, డైలాగ్స్ - అబ్బూరి ర‌వి, నిర్మాత - పి.వి.పి, ద‌ర్శ‌క‌త్వం - ఓంకార్.

English summary
Raju Gari Gadhi 2 First Look Motion Poster on PVP Cinema. #RajuGariGadhi2 latest 2017 Telugu movie ft. Akkineni Nagarjuna, Samantha, Seerat Kapoor and Ashwin Babu. The sequel for the super hit 2015 Telugu movie Raju Gaari Gadhi is directed by Ohmkar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu