Just In
- 3 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ రోజు అర్ధనగ్నంగా ఉంటే సానుభూతితో అలా చేశా.. నీ సంగతి తేలుస్తా.. శ్రీ రెడ్డిపై రాకేష్ మాస్టర్ ఫైర్
వివాదాస్పద వ్యాఖ్యలతో, సినీ పెద్దలపై విరుచుకుపడుతూ టాలీవుడ్ సంచలన తారగా పేరుతెచ్చుకుంది శ్రీ రెడ్డి. ఆధారాల సంగతేమో గానీ ఆమె చెప్పాలనుకున్న విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేసి రచ్చ రచ్చ చేయడం శ్రీ రెడ్డికి అలవాటు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే రాకేష్ మాస్టర్ తనను డిన్నర్‌కి పిలిచాడని సంచలన కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. తాజాగా ఈ ఇష్యూపై ఫైర్ అవుతూ రియాక్ట్ అయ్యాడు రాకేష్ మాస్టర్. వివరాల్లోకి పోతే..

శ్రీరెడ్డిపై బహిరంగ సవాల్
ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. శ్రీరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగ సవాల్ విసిరాడు. శ్రీరెడ్డి లాంటి మహాతల్లిని చూస్తే.. పుట్టినబిడ్డ సైతం అమ్మ పాలు తాగడానికి భయపడుతుందని కామెంట్స్ చేశాడు. పసి బిడ్డకి కూడా వేరే ఆలోచన కలిగించేలా నీఛమైన ప్రవర్తన శ్రీ రెడ్డిది అంటూ ఫైర్ అయ్యాడు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్.

ఆ రోజు అర్ధనగ్నంగా ఉంటే..
ఆ రోజు శ్రీ రెడ్డి అర్ధనగ్నంగా రోడ్డుమీద ఉంటే.. ఆడపిల్ల కదా అనే సిపంథీతో ఫోన్ చేసి మాట్లాడాను. నేనే కాదు.. మా అన్నయ్య, వదిన, వాళ్ల బిడ్డలు కూడా శ్రీరెడ్డితో మాట్లాడారు. కానీ ఆమె మాత్రం నన్ను డిన్నర్‌కి పిలిచారు అంటూ ఏవేవో చెప్పి.. నన్ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేసింది అని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

నేను పిలవలేదు.. అయినా వదిలే ప్రసక్తే లేదు
తనను బాబాయ్ అని పిలివమని శ్రీ రెడ్డితో చెప్పానని, ఆ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఏమైందమ్మా అని ఫోన్ చేసి.. మా అన్నయ్య, వదిన, వాళ్ల కూతుళ్లు ఆమెను భోజనానికి పిలిచారు. నేను ఆమెను పిలవలేదని రాకేష్ మాస్టర్ అన్నాడు. ఇప్పుడు నా పైనే నిండా వేస్తోంది కాబట్టి ఈ విషయంలో ఆమెను వదిలే ప్రసక్తే లేదని ఆయన అన్నాడు.

అదే జరిగితే ప్రూఫ్ చూపించు
''నిజంగా ఆమె నుండి నేను ఏమైనా ఆశించి ఉంటే.. బాబాయ్ అని పిలువు తల్లీ అని ఎందుకు చెప్తా. హలో.. రాకేష్ మాస్టర్ గారు అని శ్రీ రెడ్డి అనేది. వద్దమ్మా.. బాబాయ్ అని పిలువు అని నేనే చెప్పా. ఒకవేళ నేను ఆమెతో వల్గర్‌గా మాట్లాడి ఉంటే ఆ ఆడియో లీక్ చేయొచ్చు కదా.. రాకేష్ మాస్టర్ ఎవరితో ఎంత వరకూ ఉండాలో అంతవరకే ఉంటాడు'' అని అన్నాడు రాకేష్.

శ్రీరెడ్డి! నీ సంగతి తేలుస్తా.. స్ట్రాంగ్ వార్నింగ్
బరితెగించి ఒళ్లంతా తిప్పుతూ ఫేస్‌బుక్‌లో ఎంతమందిపై ఇలా అబాండాలు మోపుతుంది. పైగా మాట్లాడితే నా ఇష్టం నీకేం ఇబ్బంది అంటుంది. ఇప్పుడు నేను కూడా అంటున్నా. నా ఇష్టం నేను నీ గురించి మాట్లాడుతున్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. అబద్ధం ఆడేవాళ్లకు తెలివి అవసరం. నిజం చెప్పేవాడికి ధైర్యం ఉంటే చాలు. నాకు ధైర్యం ఉంది. ఏ ఛానల్‌కి అయినా రా.. శ్రీరెడ్డి! నీ సంగతి తేలుస్తా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు రాకేష్ మాస్టర్.