»   » రాఖీ సావంత్‌ను అరెస్టు చేయలేదు, ఆమెకోసం గాలిస్తున్నాం!

రాఖీ సావంత్‌ను అరెస్టు చేయలేదు, ఆమెకోసం గాలిస్తున్నాం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మీద వాల్మీకి వివాదంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఆమె అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను ఇంకా అరెస్టు చేయలేదని లూథియానా పోలీసులు స్పష్టం చేసారు.

రాఖీ సావంత్ ను అరెస్టు చేసేందుకు ముంబైకి లూథియానా పోలీసులు వెళ్లారు, అయితే ఇంకా అరెస్టు చేసినట్లు కన్ఫర్మేషన్ రాలేదు అని లూథియానా పోలీస్ కమీషనర్ కున్వార్ విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

ఏమిటి వివాదం?

ఏమిటి వివాదం?

ఓ టెలివిజన్ షోలో పాల్గన్న రాఖీ సావంత్.. వాల్మీకి మహర్షికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు మనోభావాలను గాయపర్చే విధంగా అమె వ్యాఖ్యలు చేశారని, దీనిపై పంజాబ్ కు చెందిన పలువురు యువకులు అమెకు వ్యతిరేకంగా స్తానిక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.

కోర్టుకు రాక పోవడం వల్లే

కోర్టుకు రాక పోవడం వల్లే

అయితే మార్చి 9న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని అమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. వాటిని కూడా తేలిగ్గానే తీసుకున్న సావంత్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అమెపై న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేయగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ముంబై వెళ్లారు.

ఈ కామెంట్స్ వల్లే

ఈ కామెంట్స్ వల్లే

వాల్మీకిని పోల్చుతూ మికా సింగ్‌పై రాఖీ కామెంట్ చేసింది. దోపిడి దొంగ నుంచి రుషిగా మారిన వాల్మీకి మాదిరిగానే మికా మారాడు. అది ఒక ఉదాహరణ మాత్రమే. అంతేగాని వాల్మీకిని దూషించడం నా అభిమతం కాదు అని రాఖీ సావంత్ తెలిపింది.

సల్మాన్ ను కాదు అంటూ వెటకారం

సల్మాన్ ను కాదు అంటూ వెటకారం

ఈ వివాదం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ...అరెస్టు చేయడానికి నేను సల్మాన్‌ ఖాన్ కాదు. నేను రాఖీ సావంత్‌ను. సామాజిక సేవకు అకింతమైన, సినిమాల్లో నటించే సాధారణ అమ్మాయిని అంటూ ఆమె వెటకారంగా మాట్లాడారు.

English summary
Rakhi Sawant not arrested yet for Valmiki comment, says Ludhiana police. Rakhi Sawant claimed that she was been arrested for allegedly making inflammatory remarks against the sage, the Ludhiana police denied confirmation of the same. "A non-bailable warrant was issued against Rakhi. A team from Ludhiana has been sent to Mumbai to execute the warrant. There has been no confirmation regarding the arrest," Ludhiana Police Commissioner Kunwar Vijay Pratap Singh said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu