»   » రాఖీ సావంత్ తలకు గాయం, గుండు గీసి ఆపరేషన్ చేసారు,జ్ఞాపకశక్తిని కోల్పోయింది

రాఖీ సావంత్ తలకు గాయం, గుండు గీసి ఆపరేషన్ చేసారు,జ్ఞాపకశక్తిని కోల్పోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : నిజం..ఇది రియల్ లైప్ కు చెందిందే..ఇదేదో సినిమాలో రాఖీ సావంత్ క్యారక్టరైజేషన్ గురించి చెప్తున్నది కాదు. ఈ విషయాన్ని స్వయంగా రాఖీ సావంతే స్వయంగా చెప్పింది కాబట్టి నమ్మాల్సిందే. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియచేసింది.

రాఖీ సావంత్ మాట్లాడుతూ... తన లైఫ్ లో బ్యాడ్ పీరియడ్స్ మరికొన్ని ఉన్నాయని అంటోంది రాఖీ. అప్పట్లో కొలంబోలో ఓ షూటింగ్ సందర్భంగా ఈవిడ తలకు చాలా పెద్ద తగిలిందట. అప్పుడే ఆమె జీవితం తలక్రిందులు అయ్యిందిట. రెండు సంవత్సరాలు పాటు మీడియాకు దూరంగా ఉన్నానంది.

Rakhi Sawant recalls horrific accident that made her go bald

రాఖీ ఆ సంఘటన గురించి చెబుతూ.. 'స్టేజ్ అంతా పొగ ఉండడంతో కాలికి ఏదో తగిలి కింద పడిపోయా. తలకు గాయం కావడంతో.. గుండు గీసి మరీ తలకు ఆపరేషన్ చేశారు. ఆ కారణంగా పబ్లిక్ లోకి కూడా రాలేకపోయా. అది కూడా కాకుండా.. జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయాను.

ఆ దెబ్బ కారణంగా ఆల్మోస్ట్ లేడీ గజినిలా మారిపోయానంటే నమ్మండి. నాకు ఆ సమయంలో మనుషుల పేర్లు కూడా గుర్తు రాలేదు' అంటూ పాత కబుర్లను కొత్తగా చెప్పింది రాఖీ సావంత్.

ఆ షాక్ నుచి కోలుకోవడానికి రెండేళ్లు పట్టిందట ఈ బ్యూటీకి. ఈ సమయంలో బరువు పెరిగిపోయినా.. మళ్లీ బాగా కష్టపడిపోయి సన్నబడి.. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అని చెబుతోంది రాఖీ. అలాగే తనకు బ్యాడ్ పీరియడ్ నడించింది కదా అని కుంగిపోలేదట. తను ఆ కష్టాలను అన్నటిని వదిలేసి దబాంగ్ స్టైల్ లో తిరిగి వచ్చానంటోంది.

English summary
Rakhi Sawant said, "I had met with an accident while performing for a show in Colombo. I tripped and hurt my head, as there was too much artificial fog at the stage. I had to shave my hair and undergo an operation"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu