»   » రాజకీయాల్లోకి రవితేజ హీరోయిన్, సినిమాలకు గుడ్ బై

రాజకీయాల్లోకి రవితేజ హీరోయిన్, సినిమాలకు గుడ్ బై

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాళహస్తి: రవితేజ హీరోగా వచ్చిన 'ఇడియట్' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కన్నడ భామ రక్షిత తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో పెళ్లాం ఊరెళితే, నిజం, శివమణి, లక్ష్మి నరసింహ, ఆంధ్రావాలా, అందరివాడు, జగపతి, అదిరిందయ్యా చంద్రం అనే చిత్రాల్లో నటించింది.

ఒకప్పుడు సెక్సీగా ఆకట్టుకునే రూపంతో ఉన్న రక్షిత పెళ్లయిన తర్వాత బొద్దుగా బొండంలా మారి సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఇక సినిమాలకు పూర్తిగా దూరంగా కావాలని నిర్ణయించుకుంది. రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచనలో ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది.

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళ హస్తి వచ్చిన రక్షిత.....తన భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియాకు వెళ్లడించింది. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ తరుపున కర్నాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని వెల్లడించింది. జేడీఎస్ పార్టీ నుండి తప్ప, మ్యాండ్యా నియోజకవర్గం నుండి తప్ప మరేప్రాంతం నుండి, మరే పార్టీ నుండి పోటీ చేయను అని రక్షిత వెల్లడించడం గమనార్హం.

కాగా...వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులంతా సినితారలే కావడం గమనార్హం. ఇటీవల మాండ్య నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున కన్నడనటి రమ్య పోటీ చేసిన గెలుపొందింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమె ఇదే స్థానం నుండి పోటీ చేయనుంది. మరో వైపు కన్న నటుడు ఉపేంద్ర బీజేపీ తరుపున పోటీకి దిగుతారని వినికిడి.

English summary
Actress Rakshita has declared that she will contest the next Lok Sabha elections from Mandya constituency and nowhere else. She has said that her party, JDS has promised her ticket from Mandya. 
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu