»   » ఇడియట్ రక్షిత స్వయవరం ప్రకటిస్తోంది

ఇడియట్ రక్షిత స్వయవరం ప్రకటిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇడియట్ నుంచి అందరి వాడు దాకా నటించిన రక్షిత ఆ మధ్య కన్నడ దర్శకుడు ప్రేమ్ ని పెళ్ళాడి వెండి తెరకు దూరమైంది. అయితే తాజాగా ఆమె కన్ను బుల్లి తెరపై పడింది. స్వయంవర పేరుతో ఆమె పోగ్రామ్ ని రూపొందించి, యాంకరింగ్ చేస్తూ,ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే ఈ స్వయంవర ఎపిసోడ్ కి హిందిలో రాఖీసావంత్, రాహుల్ మహాజన్ చేస్తున్న టెలివిజన్ రియాలటీ షోలకు సంభందం లేదంటోంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...తమ కాన్సెప్టు చాలా డిఫెరెంటు అని, ఫన్ తో కూడుకున్నదని, సువర్ణ ఛానెల్ లో ఏప్రియల్ నుంచి టెలికాస్ట్ అవుతుందని చెప్తోంది. ఇక ఈ పోగ్రామ్ కి ఇప్పటికే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇక కన్నడ టెలివిజన్ చరిత్రలోనే ఆమె తీసుకునే రెమ్యునేషన్ హైయిస్ట్ అని చెప్తున్నారు. ఇక ఈ పోగ్రాం నలభై ఎపిసోడ్స్ గా రన్ అవ్వనుంది. అలాగే రక్షిత తన భర్త ప్రేమ్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ వందవ చిత్రం జోగయ్యని నిర్మిస్తోంది. ఈ మధ్యనే బెంగుళూరులో ఈ చిత్రం ముహూర్తం జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu