»   »  జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కామియో రోల్స్..!? 3 కోట్లతో పాట కోసం సెట్... వామ్మో ఏంటిదీ...!

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కామియో రోల్స్..!? 3 కోట్లతో పాట కోసం సెట్... వామ్మో ఏంటిదీ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైఓల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ బోయపాటి శీను. సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బోయపాటి ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లోద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌రైనోడు వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయపాటిశ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

ఈ చిత్రంలో త‌మిళ స్టార్ శ‌ర‌త్‌కుమార్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో కీల‌క పాత్ర‌లోజ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికలుగా రకుల్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం .. ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం భారీ సెట్ ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో 3 కోట్ల ఖర్చుతో చాలా లాషిగ్ గా ఓ సెట్ ని రూపొందించారట. ఆ సెట్ లో రకుల్, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి స్టెప్పులేయనుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్య విషయమేమంటే పేరు పెట్టని ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కామియో రోల్ లో కనిపించనున్నారని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేస్తోండగా, తనదైన స్టైల్ లో బాణీలు రెడీ చేస్తున్నాడట.

rakul dance in 3 crore set 3 crores set for a song in Boyapati Sreenu's next film

ఇందులో జగపతిబాబు పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని అంటోంది యూనిట్. మొదటి సినిమాతో నే వివి వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో పది మంచి హిట్ సాధించిన బెల్లంకొండ రెండవ ప్రయత్నంగా చేసిన సినిమా వచ్చినట్లు ఎవరీకి తెలీదు కూడా..

ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బోయపాటితో కలిసి సినిమా చేస్తున్నాడు.. తన మొదటి సినిమాలాగానే భారీ తారాగణంతో ఈ సినిమా చేస్తున్న బెల్లంకొండ ని విజయం వరిస్తుందా అనేది అందరి డౌటు.. అంతే కాదు తమిళ స్టార్ శరత్‌కుమార్ ఓ ప్రధాన పాత్రలో పోషిస్తున్నాడు. మరి ఇంత పెద్ద స్టార్స్ ని పెట్టి తీస్తున్న ఈ యువ హీరో సినిమాలను హిట్ చేసుకోవడంలో వెనుకపడ్డాడు. కనీసం బోయపాటి సినిమా అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

English summary
As per the latest reports, it was known that currently a song shoot is underway in Annapurna Studios, where it was being filmed in a huge set which cost 3 crores. This is really a very high amount for a single song and that too for a young hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu