»   » మరో ‘మెగా’ ఆఫర్ దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్

మరో ‘మెగా’ ఆఫర్ దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వరుస భారీ ఆఫర్లదో దూసుకెలుతోది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి సినిమా చేస్తున్న ఈ అమ్మడు మరో అవకాశం దక్కించుకుంది. త్వరలో బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేయబో సినిమాలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం.

‘రకుల్ ప్రీత్ సింగ్ బోయపాటి-అల్లు అర్జున్ ప్రాజెక్టుకు లీడ్ హీరోయిన్ గా ఓకే అయింది, ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, జులైలో సినిమా ప్రారంభం అవుతుంది' అని బోయపాటి సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న మాట.

Rakul Preet Singh Bags Another Mega Offer

ఈ చిత్రాన్ని బోయపాటి తనదైన శైలిలో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ హోం బేనర్ గీతాఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బిజీగా గడుపుతోంది. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో జాయిన్ కాబోతోంది. అమ్మడికి మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది.

English summary
Actress Rakul Preet Singh, who currently has films with all the leading stars of Telugu such as Junior NTR and Ram Charan, has bagged yet another biggie. The actress has signed Boyapati Srinu's yet-untitled next directorial with Allu Arjun.
Please Wait while comments are loading...