»   » శ్రీరెడ్డి, మాధవీలతకు రకుల్ ప్రీత్ షాక్.. నాకు ఆ అనుభవం ఎదురుకాలేదు.. లైంగిక వేధించలేదు..

శ్రీరెడ్డి, మాధవీలతకు రకుల్ ప్రీత్ షాక్.. నాకు ఆ అనుభవం ఎదురుకాలేదు.. లైంగిక వేధించలేదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో వేషాల కోసం కొందరు నిర్మాతలు పడకగదిలోకి (కాస్టింగ్ కౌచ్) రమ్మంటూ వేధిస్తున్నారనే వివాదం కొనసాగుతున్నది. తమను లైంగిక కొందరు వేధిస్తున్నారని, పడక గది సుఖం కోసం వేధించారని టాలీవుడ్ హీరోయిన్లు మాధవీలత, శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం లేపాయి. తమకు అలాంటి అనుభవాలు లేవని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు చేయడంతో కొంత వివాదంగా మారింది. టాలీవుడ్‌లో జోరుగా సాగుతున్న వివాదంపై రకుల్ ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికతో స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

Veteran Actress Jayasheela Fires On Sri Reddy
రకుల్‌పై భగ్గుమన్న శ్రీరెడ్డి

రకుల్‌పై భగ్గుమన్న శ్రీరెడ్డి

ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ నాకు అలాంటి అనుభవం ఇంత వరకు ఎదురు కాలేదు అని రకుల్ కామెంట్ చేయడంతో ఆమెపై శ్రీరెడ్డి, మాధవీలత భగ్గుమన్నారు. తెలుగు హీరోయిన్ల అవకాశాలు ఇవ్వకుండా ఉత్తరాది వారికి ఆఫర్లు ఇవ్వడం వల్లే పరిశ్రమలోని పెద్దలకు రకుల్ అండగా నిలుస్తారని వారు ఆరోపించారు.

ఇంతకు వారెవరో తెలీదు..

ఇంతకు వారెవరో తెలీదు..

మాధవీలత, శ్రీరెడ్డి వ్యాఖ్యలపై రకుల్ స్పందిస్తూ.. ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి నాకు తెలీదు. వారిని ఏ సినిమాలో కూడా చూడలేదు. అయినా వారంటే నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నా అనుభవాల గురించే మాత్రమే నేను మాట్లాడాను. టాలీవుడ్‌లో నేను చాలా సురక్షితంగా ఉన్నాను అని అన్నారు.

నేనెందుకు మాట్లాడాలి...

నేనెందుకు మాట్లాడాలి...

లైంగిక వేధింపులను ఎదుర్కోనపుడు నేను ఎలా దానికి గురించి ప్రతికూలంగా మాట్లాడుతాను. ఒకవేళ నేను అబద్దం ఆడుతున్నానని వారి భావిస్తే.. అంతకంటే నేనేమీ చేయలేను. మాట్లాడలేను. సినీ పరిశ్రమ నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది అని రకుల్ ప్రీత్ అన్నారు.

పబ్లిసిటీ కోసం ఏదేదో రాస్తారు..

పబ్లిసిటీ కోసం ఏదేదో రాస్తారు..

సినీ పరిశ్రమలో అవకాశవాదం ఉంటుందనే విషయాన్ని కాదనలేం. ఇక్కడ జరిగే ప్రతీ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఏం జరిగినా అలాంటి వాటికి ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్క విషయం హైలెట్‌గా మారుతాయి. టాలెంట్‌ ఒక్కటే పరిశ్రమలో నిలబెట్టే అంశం. దానిని మాత్రమే నమ్ముకోవాలి అని రకుల్ అభిప్రాయపడింది.

 బిజీ బిజీగా రకుల్ ప్రీత్

బిజీ బిజీగా రకుల్ ప్రీత్

రకుల్ దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్‌తో ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో కార్తీతో ఓ రొమాంటిక్ చిత్రంలో, సూర్యతో ఎన్‌జీకే, శివకార్తీకేయన్‌తో ఓ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నది.

English summary
Actor Rakul Preet Singh reacts to the accusations made by Telugu actors Maadhavi Latha and Sri Reddy, who recently staged a protest against sexual harassment in Tollywood by stripping. Rakul’s reaction to their accusations is rather interesting. She says that she doesn’t even know them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X