Just In
- 30 min ago
Check Movie 10 days collections: నితిన్‌కు షాకిచ్చిన ఆడియెన్స్.. భయపెడుతోన్న భారీ టార్గెట్!
- 1 hr ago
A1 Express 3 Days Collections: మోస్తరు స్పీడుతో వెళ్తోన్న A1 ఎక్స్‌ప్రెస్.. ఇంకా అంత వస్తేనే హిట్!
- 1 hr ago
‘వకీల్ సాబ్’ నుంచి ఉమెన్స్ డే స్పెషల్ సర్ప్రైజ్: వాళ్లతో కలిసి వచ్చిన పవన్ కల్యాణ్
- 2 hrs ago
Uppena 24 Days Collections: ఆదివారం అరుదైన ఘనతను అందుకున్న ఉప్పెన.. ఆ జాబితాలో మూడో స్థానం
Don't Miss!
- Sports
India vs England: నా పేరు చెప్పుకొని.. హాయిగా డ్రింక్ తాగండి: నెటిజన్లకు రవిశాస్త్రి పంచ్
- News
పెట్రో ధరలపై దద్దరిల్లిన పార్లమెంటు- రాజ్యసభలో విపక్షాల ఆందోళన-వాయిదాల పర్వం
- Lifestyle
మీకు డయాబెటిస్ ఉందా? మీరు ఎలాంటి పండు తినవచ్చో ఖచ్చితంగా తెలియదా? దీన్ని చదువు ...
- Automobiles
తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు
- Finance
సౌదీ ఆరామ్కో టార్గెట్‌గా మిసైల్ అటాక్, భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు అలాంటి పరిస్థితి రావొద్దు.. వాటిని పూసగుచ్చినట్టు వివరించిన రకుల్
ఇప్పుడంటే జనాలకు కరోనా మీద భయం పోయింది. పైగా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. కానీ ఐదారు నెలల క్రితం కరోనా అంటే తెగ భయపడేపోయేవారు. పాజిటివ్ వచ్చిందంటే చాలు ఏదో పాపం చేసినట్టుగా చూసేవారు. అలా కరోనా వైరస్ జనాలను భయపెట్టేసింది. కానీ ఇప్పుడు కరోనా అంటే లైట్ తీసుకుంటున్నారు. కరోనాను జయించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అదే విషయాన్ని రకుల్ ఇప్పుడు చెప్పుకొచ్చింది.

కరోనా పాజిటివ్..
రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మేడే సినిమా షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టిన తరువాత రకుల్‌కు పాజిటివ్ అని సోకింది. అలా పాజిటివ్ వచ్చిన వెంటనే రకుల్ క్వారంటైన్‌కే పరిమితమైంది. క్వారంటైన్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంది.
వయ్యారాల సోయగం.. మనీషా అందాల ఆరబోత

నెగెటివ్ వచ్చాక..
రకుల్ క్వారంటైన్ ముగించుకుని నెగెటివ్ రిపోర్ట్ వచ్చాక వెంటనే సినిమా షూటింగ్‌లో పాల్గొంది. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ఎక్కువగా విశ్రాంతి తీసుకోలేకపోయింది. మేడే, అలయాన్ వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఈ లోపే మరికొన్ని సినిమాలను ఓకే చేసింది.

పాటించిన నియమాలివే..
తాను క్వారంటైన్‌లో చేసిన పనులు, పాటించిన నియమాలనుచెబుతూ రకుల్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో యోగాసానాలు, ఆవిరి పీల్చడం, పసుపు నీళ్లు తాగడం, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ వంటి చేశానని చూపించింది. రోజంతా ఇదే పని అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత డాక్టర్లు సూచించినట్టుగా మందులు, విటమిన్ల ట్యాబెట్లు వేసుకోవాలని తెలిపింది.

మీకు ఆ పరిస్థితి రావొద్దు..
కరోనాను ఎలా జయించాను.. క్వారంటైన్‌లో ఏం చేశానో మీ అందరికీ చెప్పాను.. ఇది మీలో ఎవ్వరికైనా ఉపయోగపడొచ్చు.. కానీ అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు.. ఎవ్వరూ కరోనా బారిన పడకూడదని రకుల్ చెప్పుకొచ్చింది. కరోనా నెగెటివ్ వచ్చాక కూడా విశ్రాంతి తీసుకోవాలి.. సరైన ఆహారం తీసుకోవాలి.. వ్యాయామం చేయాలని సూచించింది.