»   » 24 ఏళ్ల క్రితం జరిగిన విషయంపై రామ్ చరణ్ ఇలా...(ఫోటో)

24 ఏళ్ల క్రితం జరిగిన విషయంపై రామ్ చరణ్ ఇలా...(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై మే9 తేదీతో 24 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో స్పందించారు.

'24 ఏళ్ల క్రితం ఇదే రోజు వెండి తెరపై ఓ మ్యాజిక్ జరిగింది. అదే 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఇద్దరికీ కంగ్రాట్స్. ఇద్దరితో కలిసి ఇంట్లో సాయంత్రం సయమం గడపడం చాలా లక్కీగా భావిస్తున్నాను' అంటూ చరణ్ వ్యాఖ్యానించడంతో పాటు చిరంజీవి, రాఘవేంద్రరావుతో దిగిన ఫోటో పోస్టు చేసాడు.

Ram Charan about 'Jagadeka Veerudu Atiloka Sundari'

'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిరంజీవి కెరీర్ లో ఓ ఆణిముత్యం లాంటి సినిమా. తెలుగు సినీ చరిత్రలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే.. మళ్ళీ ఆ సినిమాని రీమేక్‌ చేస్తారనే విషయమై గతంలో ఊహాగానాలు వచ్చాయి. ఓ దశలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాని అశ్వనీదత్‌ నిర్మాతగా.. రామ్ చరణ్‌ హీరోగా, శ్రీదేవి కుమార్తె హీరోయిన్‌గా రూపొందిస్తున్నారనే ప్రచారమూ జరిగింది. కానీ.. ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎవరూ దృవీకరించలేదు.

Post by Ram Charan.

ఆ సంగతి పక్కన పెడితే....ప్రస్తుతం రామ్ చరణ్ 'గోవిందుడ అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్నాడు. అయితే చరణ్ నిన్న తీవ్రమైన జ్వరం భారిన పడటంతో షూటింగ్ నిలిపి వేసారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఇంట్లోనే ఉంటూ రెస్టు తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
"24 years ago on this same day they created magic together on screen -Jagadeka Veerudu Atiloka Sundari. Congrats!! Lucky to spend the evening with both at home." Ram Charan posted on face book.

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu