»   » నాకు వేరే ఆప్షన్ ఏది, యస్ ..నాన్న కోసమే చేసా : మనస్సులో మాట చెప్పేసిన రామ్ చరణ్

నాకు వేరే ఆప్షన్ ఏది, యస్ ..నాన్న కోసమే చేసా : మనస్సులో మాట చెప్పేసిన రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నోట్ల రద్దు అనేక రంగాలను తాకుతున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. టాలీవుడ్ ను కూడా రద్దు సెగ తాకింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. నోట్ల రద్దుతో ప్రేక్షకులు సినిమా థియేటర్ రాడని..చిల్లరకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని దర్శక..నిర్మాతలు భావిస్తున్నారు. అయితే రామ్ చరణ్ మాత్రం ధైర్యంగా నోట్ల రద్దు 'ధృవ'ని తాకుతుందనే భయం లేకుండా రిలీజ్ చేసేసారు.

మొదట డిసెంబర్ 2న 'ధృవ' సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు కావడంతో విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్ణయించారు. నోట్ల రద్దు కారణంగా విడుదల చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. కానీ ఓ వారమే గ్యాప్ తీసుకుని డిసెంబర్ 9వ తేదీన 'ధృవ' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

మొత్తంగా సినిమా మీద ఫుల్ పాజిటివ్ బ‌జ్ ఉండటం ప్లస్ అయ్యింది. పైగా తెలుగులో భారీ సినిమా వ‌చ్చి చాలా కాలం అవుతోంది. కాబ‌ట్టి 'ధృవ' క‌లెక్ష‌న్లు ఆశాజ‌న‌కంగానే ఉన్నాయి. కాక‌పోతే పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం ఇంకా క‌లెక్ష‌న్ల‌పై ఉందనేది మాత్రం కొట్టి పారేయలేని విషయం . దాన్ని ఎంత‌మేర‌కు 'ధృవ' త‌గ్గిస్తుంది.. క‌లెక్ష‌న్లు సాధిస్తుంది అన్న‌దే ఆస‌క్తిక‌రం. ఇది ప్రక్కన పెడితే ఈ విషయాలన్ని తెలిసిన రామ్ చరణ్ ఎందుకు ..రిలీజ్ కు ఒప్పుకున్నారన్నది ప్రశ్న. ఈ విషయమై ఆయన మీడియాకు సమాధానమిచ్చారు.

 నాన్న సినిమా వల్లే...

నాన్న సినిమా వల్లే...

నాకేం ఛాయిస్ ఉంది చెప్పండి. నేను ధృవను పోస్ట్ ఫోన్ చేస్తే ...నేను ఏ డేట్ కు రావాలి...జనవరిలో రావాలి. జనవరి 13న మా నాన్న చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెంబర్ 150 ..రిలీజ్ ఉంది. అదీ నా స్వంత సినిమా. నాన్న సినిమాతో నేను పెట్టుకోలేను కదా అందుకే ముందే వచ్చేసాం అన్నారు రామ్ చరణ్ .

 తప్పు చేయలేం

తప్పు చేయలేం

"అంతేనా నేను ఆయన కుమారుడుని మాత్రమే కాకుండా ఆ సినిమాకు నిర్మాతను కూడా. దానికి తోడు నాన్నగారి ప్రతిష్టాత్మక 150 వ చిత్రం. ఇటువంటి సమయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేం. ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి , ప్లాన్ చేయాలి " అంటూ పరిస్దితిని వివరించారు రామ్ చరణ్.

 సెంటిమెంట్ గా ఫీలై

సెంటిమెంట్ గా ఫీలై


ఖైదీ నెంబర్ 150లో సినిమాలో నాన్న గారు, నేను కలిసి ఓ సాంగ్ లో కనపడతాం. ఆ సినిమాలో నేను ఓ కామియో చేస్తున్నా. ఇది ఓ సెంటిమెంట్ కారణాలతో కూడుకున్నది. నిజానికి మా నాన్న సినిమాకు నేను కనపడాల్సిన అవసరం లేదు అంటూ మెగాస్టార్ గొప్పతానాన్ని చెప్పకనే చెప్పారు రామ్ చరణ్.

 నేను ఇంకా పిల్లాడినే

నేను ఇంకా పిల్లాడినే


నాలుగేళ్ళ క్రితం ఉపాసన కామినేని ని వివాహం చేసుకున్న రామ్ చరణ్...తను తండ్రి అవటానికి కొంత సమయం ఉందన్నారు. తన భార్య కంపెనీని కొంతకాలం ఎంజాయ్ చేస్తానని అన్నారు. అలాగే...నేను ఇంకా చిన్నపిల్లాడినే..అప్పుడే తండ్రి ఏంటి అని కొట్టిపారేసారు. ఒకరి కంపెనీ ని మరొకరు ఎంజాయ్ చేయటానికి ఇంకాస్త సమయం తీసుకుంటాం అని వివరించారు.

 ఆ పాత్రతో పోలిక లేదు

ఆ పాత్రతో పోలిక లేదు


నేను ఇంతకు ముందు కూడా పోలీస్ పాత్ర పోషించారు. అయితే ధృవ సినిమాలో పోలీస్ పాత్రతో పోలిక లేదు. ఈ పాత్ర చాలా ఫిట్ గా , ఎలర్ట్ గా ఉంటుంది. అందు కోసమే నేను ఆ పాత్ర కోసం అని బాడీని పెంచాను. అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది అన్నారు.

 సమస్య ఉందని తెలుసు

సమస్య ఉందని తెలుసు


నిజానికి బయిట ఫైనాన్సియల్ సిట్యువేషన్ , సమస్య ఉందని తెలుసు. మా సినిమా రిలీజ్,కలెక్షన్స్ పై దాని ప్రభావం ఉంటుందని తెలుసు. కానీ మాకు వేరే ఛాయిస్ లేదు. మేము అన్ని విధాల ప్రిపేర్ అయ్యే ఉన్నాము. ఓ ముప్పై పర్శంట్ ప్రేక్షకులు ఈ సమస్యతో మా సినిమాకు దూరంగా ఉంటారని అంచనా వేస్తున్నాము అన్నారు.

 ఏ సోర్స్ నుంచి అనేది మ్యాటర్ కాదు

ఏ సోర్స్ నుంచి అనేది మ్యాటర్ కాదు

"రీమేక్ ఎందుకు చేసానని అడుగుతున్నారు. కానీ బాగాలేని ఓ ఒరిజనల్ చేయటం కన్నా డీసెంట్ గా ఉన్న రీమేక్ బెటర్ కదా. కంటెంట్ కింగ్ అని భావిస్తాను. ఆ కంటెంట్ ఏ సోర్స్ నుంచి వచ్చిందనేది విషయం కాదు. అది వర్కవుట్ అవుతుందా లేదా అన్నదే ఆలోచించాల్సింది. మేము తమిళ చిత్రాన్ని చూసి ఇష్ట పడ్డాం. రీమేక్ చేసాము అన్నారు.

 ఆ సమస్యే రాదు

ఆ సమస్యే రాదు


అరవింద్ స్వామికి ఎక్కవ ఫుటేజ్ ఉందనే విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందే చెప్పినట్లు కంటెంట్ నే నేను ఫాలో అయ్యాను. కంటెంట్ ని నమ్మే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. అలాంటప్పుడు ఈ సమస్యే రాదు. నేను ప్రతీ ఫ్రేమ్ లో కనపడాలి అనుకోలేదు. హీరో వర్షిప్ ఇలాంటి కథలను కరప్ట్ చేస్తుంది అన్నారు.

 నిక్కచ్చిగా ఇలా..

నిక్కచ్చిగా ఇలా..

నా నిజమైన అభిమానులు మంచి సినిమాని చూడాలనుకుంటారు. నన్ను కాదు. అలా కానప్పుడు వాళ్లు నా ఫ్యాన్స్ గా ఎక్కువ కాలం ఉండరు అంటూ నిక్కచ్చిగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

 నోటు కొట్టింది

నోటు కొట్టింది


ఇక ధృవ చిత్రానికి ఓవ‌ర్సీస్ వ‌సూళ్లు మాత్రం బాగానే ఆదుకున్నాయ‌ని చెబుతున్నారు. వాస్తవానికి జ‌న‌తా గ్యారేజ్‌, శ్రీ‌మంతుడు వంటి సినిమాల రికార్డుల్ని ధృవ కొట్టేస్తాడ‌ని అంచ‌నా వేస్తే.. నోటు దెబ్బ ఇలా కొట్టేసింద‌ని చెబుతున్నారు.

 మారిందా..

మారిందా..

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో 'ధృవ' లాభాల బాట ప‌ట్టాలంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుత ప్ర‌ద‌ర్శ‌నే చేయాలి. ఈ సినిమాకు ఏకంగా 56 కోట్ల దాకా థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది మ‌రి. ఈ లెక్క‌లు పెద్ద నోట్ల ర‌ద్దుకు ముందు నాటివి. ఈ నిర్ణ‌యం త‌ర్వాత ఏమైనా మార్పులున్నాయేమో తెలియ‌దు.

 ఏ స్దాయిలో ..

ఏ స్దాయిలో ..


రామ్ చ‌ర‌ణ్ లాస్ట్ మూవీ 'బ్రూస్ లీ' డిజాస్ట‌ర్ అయినా.. 'ధృవ‌'కు బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రిగింది. నైజాంలో రూ.13.5 కోట్లు.. సీడెడ్లో రూ.9 కోట్లు.. అమెరికాలో రూ.4 కోట్లు.. ఇలా ప్ర‌తిచోటా భారీ రేటు ప‌లికింది 'ధృవ‌'. మ‌రి క‌లెక్ష‌న్లు ఏ స్థాయిలో వ‌స్తాయో చూడాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రూ.56 కోట్ల షేర్ సాధించ‌డం అంటే పెద్ద టాస్కే. మ‌రి 'ధృవ' ఏం చేస్తాడో?

English summary
Ram says he couldn’t consider a delay of “Dhruva” because his father Chiranjeevi‘s film is also scheduled for release.”What choice did I have? Even if we wanted to postpone ‘Dhruva’, where would we go? My father’s film ‘Khaidi No 150‘ is all set for Pongal (January 13) release. I couldn’t push my own release to clash with his film. It is a very important film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu