For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రామ్ చరణ్ - అల్లు అర్జున్ సినిమా కి ‘రంగం’ సిద్దం

  By Sindhu
  |

  మెగా ఫ్యామిలి అభిమానులకు మరో శుభవార్త. చాల కాలంగా మల్టీస్టారర్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు పండగ రోజు త్వరలో రానుంది. మగధీర లాంటిబ్లాక్ బ్లాస్టర్ సినిమా లో హీరోగా నటించిన రా మ్ చరణ్ తేజ్, బద్రీనాథ్ సినిమా హీరో అల్లు అర్జున్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు. ఈ విషయం అల్లు అరవింద్ ఉన్న సమయంలో నిర్మాత గంటా శ్రీనివాస్ చెప్పడం కోస మెరుపు. గత శనివారం బెంగళూరు నగరంలో బద్రీనాథ్ 50 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు బద్రీనాథ్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత అల్లు అరవింద్, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి ప్రజారాజ్యం పార్టీ శాసన సభ్యడు గంటా శ్రీనివాస్ అల్లు అరవింద్ వెంటనే వచ్చారు. మొదట గంటా శ్రీనివాస్ మాట్లాడారు. మద్యలో అల్లు అరవింద్ శ్రీనివాస్ నుండి మైక్ తీసుకున్నారు.

  త్వరలో మన రా మ్ చరణ్ తో ఈయన సినిమా తీస్తున్నాడు. అందరూ థ్యాక్స్ చెప్పండి అని అభిమానులకు చెప్పారు. అదే సమయంలో మైక్ తీసుకున్న గంటా శ్రీనివాస్ అవును చరణ్ తో సినామా తీస్తున్నా. అయితే అదే సినిమా లో మన బద్రీనాథ్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు అని చెప్పడంతో అభిమానుల ఈలలు, కేకలతో ఆడిటోరియం దద్దరిల్లింది. అదే సమయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ గట్టిగా చప్పట్లు కోట్టి అభిమానుల ఉత్తేజపరిచారు. రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇద్దరు కలిసి నటిస్తున్నట్లు వారు అభిమానుల సాక్షిగా అంగీకరించారు. పక్కనే ఉన్న దర్శకుడు వీవీ వినాయక్ తరువాత మాట్లాడుతూ బన్నీ తరువాత ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అర్జున్ చూపించాలని అనుకున్నా, అదే విదంగా బద్రీనాథ్ లో చూపించా, మరో సినిమాలో ఇంకా అదిరిపోయే క్యారెక్టర్ లో బన్నీని చూపిస్తా అని అభిమానులకు చెప్పారు. ఒకే వేదిక మీద ఈ ముగ్గురు ప్రముఖులు ఈ మాటలు చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

  అయితే నిర్మాత, హీరోలు ఒకే. మరి దర్శకుడు ఎవరు అని అభిమానులు అయోమయంలో పడ్డారు. అల్లు అర్జున్ సన్నిహితులు తెలిపిన ప్రకారం దర్శకుడు ఒకే అయ్యారు. ఒక మంచి ముహుర్తంలో ఆవివరాలు వెల్లడించాలని మెగాస్టార్ బావించారని తెలిసింది. గంటా శ్రీనివాసకు ఇది మొదటి సినిమా. అయితే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమాలు చేయాలని చాల మంది ప్రముఖ నిర్మాతలు బావించారు. అయితే ఆ అదృష్టం గంటాకు దక్కింది. రాజకీయంగా మొదటి నుండి చిరంజీవి దగ్గర నమ్మకంగా ఉన్న గంటాకు ఒక మేలు చేయాలని మొదటి నుండి చిరు బావిస్తున్నారు. అయితే ఆ అవకాశం గంటాకు ఇంత త్వరగా వస్తుందని సినీ వర్గాలు అనుకోలేదు. గీతా ఆర్ట్స్, అంజనా ఫ్రోడక్షన్స్ లాంటి సంస్థలు పెట్టకుని ఒక కోత్త నిర్మాత చేతిలో ఇలాంటి అరుదైన కాంబినేషన్ ప్రాజెక్ట్ పెట్టడంలో మెగా ఫ్యామిలి ఉద్దేశం ఏమిటి అని ఆందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  ఇంతకు ముందు చిరుతో సూపర్ హిట్ సినిమా , బన్నీతో రెండు హిట్ సినిమాలు తీసిన వీవీ వినాయక్ తో ఈ మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే అది మాత్రం ఆషాడ మాసం పూర్తి అయిన తరువాత వెల్లడించాలని వీరు బావించారని తెలిసింది. బద్రీనాథ్ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు అల్లు అర్జున్ బెంగళూరులో మీడియా సమావేశం ఎర్పాటు చేసి సినిమాను ప్రమోట్ చేశారు. ఆ సమయంలో ఒక విలేకరి మీరు రామ్ చరణ్ కలిసి సినిమా తీస్తున్నారని వార్తలు వచ్చాయి కదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో అలాంటి ఏమి లేదు అని స్వయంగా అర్జున్ చెప్పారు. ఇప్పుడు మాత్రం అవును అని అల్లు అరవింద్, అర్జున్ మోనంగా ఒకే వేదికమీద అభిమానుల సమక్షంలో అంగీకరించడం కోస మెరుపు. ఏది ఏమైనా మెగా ప్యామిలి అభిమానులు సంతోషంతో ఆ సినిమా ఎప్పుడు మొదలు పెట్టి మా ముందుకు తీసుకువస్తారా అని ఏదురు చూస్తున్నారు.

  English summary
  Allu Arjun at Badrinath 50 Days and also allu aravind etc present at function. Ram Charan-Allu Arjun multistarrer is confirmed by ganta srinivas rao that vamsi paidapally is penning script for this huge multistarrer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more