»   » పవన్ కళ్యాణ్‌ని థ్రిల్ చేసిన రాంచరణ్.. బాబాయ్ కోసంఏం చేశాడంటే!

పవన్ కళ్యాణ్‌ని థ్రిల్ చేసిన రాంచరణ్.. బాబాయ్ కోసంఏం చేశాడంటే!

Subscribe to Filmibeat Telugu
Rangasthalam Team Arranges Thanks Meet

రంగస్థలం చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. చిత్రానికి విశేషమైన స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. సోమవారం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ నిర్వహించారు. త్వరలో మరో ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ పవన్ కళ్యాణ్ ని సర్ప్రైజ్ చేశాడు. సోమవారం పవన్ కళ్యాణ్ ని ఆయన ఆఫీస్ లో కలుసుకున్న రాంచరణ్ పవన్ కోసం ప్రత్యేకంగా రంగస్థలం చిత్ర షోని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చిత్ర యూనిట్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

100 కోట్ల దిశగా

100 కోట్ల దిశగా

రంగస్థలం చిత్రం వీకెండ్ ముగిసే సమయానికి కేవలం మూడు రోజుల్లనే 55 కోట్ల షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్ఛర్యంలో ముంచెత్తింది. 100 కోట్ల కలెక్షన్స్ దిశగా ఈ చిత్రం పరుగులు పెడుతోంది.

రాంచరణ్ నటనకు జేజేలు

రాంచరణ్ నటనకు జేజేలు

చిట్టిబాబుగా రాంచరణ్ కనబరిచిన నటనకు అభిమానుల నుంచి వస్తున్న స్పందన అదిరిపోతోంది. రాంచరణ్ కెరీర్ లో నటన పరంగా రంగస్థలం చిత్రం అద్భుతమైనది అందరూ ప్రశంసిస్తున్నారు.

స్టార్ హీరోల అభినందనలు

స్టార్ హీరోల అభినందనలు

రంగస్థలం చిత్రం ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్, నాని, రానా వంటి స్టార్ హీరోలంతా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రాంచరణ్ ని అభినందించిన సంగతి తెలిసిందే.

బాబాయ్ కోసం ప్రత్యేకంగా

బాబాయ్ కోసం ప్రత్యేకంగా

రాంచరణ్, పవన్ కళ్యాణ్ మధ్య ఆ బంధం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. తాజగా రాంచరణ్ బాబాయ్ పై తన ప్రేమని మరో మారు చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఆయన ఆఫీస్ లో కలుసుకున్న రాంచరణ్ ప్రత్యేకంగా రంగస్థలం షో ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

థ్రిల్‌కి గురైన పవన్

థ్రిల్‌కి గురైన పవన్

పవన్ కళ్యాణ్ రంగస్థలం చిత్రం చూసి థ్రిల్ కి గురైనట్లు తెలుస్తోంది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వంపై పవన్ మరో మారు ప్రశంసలు కురిపించారట.

English summary
Ram Charan arranges special show for Pawan Kalyan. Pawan Kalyan gets thrilled after watching Rangasthalam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X