»   » రామ్ చరణ్ సెల్ఫీ: భార్య, హీరోయిన్లతో ఇలా..(ఫోటోలు)

రామ్ చరణ్ సెల్ఫీ: భార్య, హీరోయిన్లతో ఇలా..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ షూటింగులతో బిజీబిజీగా గడిపే రామ్ చరణ్ చాలా కాలం తర్వాత తన భార్య ఉపాసన, తన కో స్టార్లతో కలిసి జాలీగా గడిపాడు. ఈ నెల 19న కాజల్ పుట్టినరోజును పురస్కరించుకుని రామ్ చరణ్ అడ్వాన్డ్స్‌ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ పార్టీలో రామ్ చరణ్ భార్య ఉపాసన, హీరోయిన్లు కాజల్, కమలినీ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ తన మొబైల్ ఫోన్‌తో అందరితో కలిసి సెల్ఫీ ఫోటోలు దిగడం గమనార్హం. ఈ మధ్య సినిమా స్టార్లు ఎక్కడ కలిసినా....ఇలా సెల్ఫీ ఫోటోలు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఇలాంటి సెల్ఫీ ఫోటోలతో హాట్ టాపిక్ అయ్యారు.

ఈ మధ్య బాలీవుడ్లోనూ పలువురు స్టార్లు సెల్ఫీ ఫోటోలతో హడావుడి చేసారు. తాజాగా రామ్ చరణ్ కూడా సెల్ఫీ ఫోటోలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను కాజల్ అగర్వాల్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో షేర్ చేసింది.

రామ్ చరణ్ సెల్ఫీ

రామ్ చరణ్ సెల్ఫీ


తన భార్య ఉపాసన, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీలతో కలిసి సెల్ఫీ ఫోటో దొగుతున్న రామ్ చరణ్.

కమిలినీ, కాజల్, రామ్ చరణ్

కమిలినీ, కాజల్, రామ్ చరణ్


తన కోస్టార్స్ కమిలీ ముఖర్జీ, కాజల్ అగర్వాల్‌లతో కలిసి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నా రామ్ చరణ్. ఇది కూడా సెల్ఫీ ఫోటోనే...

హ్యాపీ బర్త్ డే కాజల్

హ్యాపీ బర్త్ డే కాజల్


హ్యాపీ బర్త్ డే కాజల్ అంటూ రాసి ఉన్న ట్యాగ్ చూపుతున్న దృశ్యం. ఈ పార్టీలో కాజల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడిపింది.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్


కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న జన్మించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం సినిమాతో కెరీర్ ప్రారంభించిన కాజల్....‘మగధీర' సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సస

English summary
Ram Charan celebrates Kajal birthday. "Celebration part 2! With my super sweet costars RamCharan and Kamalinee. Thanks Upasana for making it so special! Xx" Kajal posted on FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu