నిహారిక హ్యాపీ వెడ్డింగ్‌కు రాంచరణ్!
మెగా డాటర్ నిహారిక, ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్, పాకెట్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు.
త్వరలో రిలీజ్ కానున్న హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 21న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. టీజర్, ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఈ ఫ్యామిలీ రొమాంటిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

happy wedding ram charan niharika konidela sumanth ashwin uv creations pocket cinema prabhas saaho laxshman karya హ్యాపీ వెడ్డింగ్ నిహారిక కొణిదెల సుమంత్ అశ్విన్ యువీ క్రియేషన్స్


Click it and Unblock the Notifications