»   »  ‘దాసరి’ జ్ఞాపకాల్లో రామ్ చరణ్, వి మిస్ యూ సార్ అంటూ...

‘దాసరి’ జ్ఞాపకాల్లో రామ్ చరణ్, వి మిస్ యూ సార్ అంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణం తెలుగు సినీపరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. దాసరి మరణం తర్వాత జరిగిన ఓ సినీ వేడుకలో రామ్ చరణ్ స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది.

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన 'కాదలి' మూవీ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ మైకు అందుకోగానే దాసరిని గుర్తు చేసుకున్నారు. 'దాసరి గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది. అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం...వుయ్ మిస్ యూ సార్' అంటూ ఆయనపై గౌరవాన్ని చాటుకున్నాడు.

గతంలో రామ్ చరణ్, దాసరి మధ్య పరిస్థితి వేరు

గతంలో రామ్ చరణ్, దాసరి మధ్య పరిస్థితి వేరు

ఆ మధ్య ఎప్పుడో దాసరి నారాయణ రావు, రామ్ చరణ్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు వార్తలొచ్చాయి. అప్పట్లో దాసరి, రామ్ చరణ్ వ్యవహార శైలి కూడా వీరి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతుందేమో? అనే అనుమానం వచ్చేలా ఉండేది.

మెగా ఫ్యామిలీ విషయంలో కూడా

మెగా ఫ్యామిలీ విషయంలో కూడా

ఆ మధ్య కొన్ని వెబ్ సైట్ల మెగా ఫ్యామిలీ వర్సెస్ దాసరి అంటూ..... చిరు, దాసరి మధ్య విబేధాలు ఉన్నట్లు వార్తలు ప్రచురించాయి. ఇండస్ట్రీలో ఏ గొడవ వచ్చినా దాసరి వర్గం, మెగా ఫ్యామిలీ వర్గం అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చేవి.

మారిన పరిస్థితులు

మారిన పరిస్థితులు

అయితే తర్వాత పరిణామాలు గమనిస్తే.... ఒకప్పుడు విబేధాలు అని రాసిన వెబ్‌సైట్లే .... దాసరి నారాయణ రావు, మెగా ఫ్యామిలీ మధ్య పరిస్థితులు చక్కబడ్డట్లు రాసుకొచ్చాయి. ఖైదీ నెం.150 ఆడియో వేడుకకు నిర్మాత రామ్ చరణ్ స్వయంగా దాసరి నారాయణ రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

దాసరికి పురస్కారం

దాసరికి పురస్కారం

దాసరి మరణానికి కొన్నిరోజుల ముందే....... అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారానికి దాసరిని ఎంపిక చేసారు. దాసరి పుట్టినరోజు సందర్బంగా అల్లు అరవింద్, చిరంజీవి స్వయంగా దాసరి నివాసానికి వెళ్లి అల్లు పురస్కారం ప్రధానం చేసారు. ఈ సందర్భంగా దాసరి గారే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చిరంజీవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

English summary
Ram Charan Condolence to Dasari Narayana Rao at Kaadhali Audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu