»   »  ‘ఎవడు’ విడుదలపై రామ్ చరణ్ స్పందన

‘ఎవడు’ విడుదలపై రామ్ చరణ్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన 'ఎవడు' వాదాల మీద వాయిదాలు పడుతూ దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ కూడా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ఖరారు చేసారు.

'వెయిటింగుకు తెర పడింది! సంక్రాంతి పండగ సందర్భంగా 'ఎవడు' చిత్రం జనవరి 12న విడుదలకు సిద్దమవుతోంది. అంతా కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందాం' అంటూ రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నారు. రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాన్ని ఖరారు చేయడంతో సినిమా విడుదల ఖాయమే అనే నమ్మకానికి వచ్చారు అభిమానులు.

Ram Charan confirms Yevadu Release Date

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ గెస్ట్ పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే ఇప్పటి వరకు లేని విధంగా పవర్ ఫుల్ యాక్షన్, అండ్ ఎంటర్టెన్మెంట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కించారని, మగధీర చిత్రాన్ని సైతం ఈచిత్రం మించి పోతుందని యూనిట్ సభ్యులుతో పాటు, చిరంజీవి కూడా చెబుతుండటం గమనార్హం.

'ఎవడు' సినిమా విడుదల లేటవుతున్నా అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. కాగా ఈ చిత్రం తాజాగా 'ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్'లో రూ. 1.5 కోట్లు ఆర్జించి సరికొత్త రికార్డు నెలకొప్పింది. 'ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్' అంటే మొబైల్ నెట్వర్కింగ్ సంబంధించిన అంశం. గతంలో అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం దీని ద్వారా రూ. కోటి ఆర్జిస్తే...తాజాగా రామ్ చరణ్ 'ఎవడు' ఆ రికార్డును బద్దలు కొట్టింది. దీన్ని బట్టి సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

English summary

 "The wait is finally over! Bringing in Sankranti earlier for all of you with Yevadu releasing on the 12th of Jan.. Hope you celebrate the festivities with us" Ram Charan told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu