twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌ నుంచి డైరక్ట్ గా వచ్చేశా...: రామ్‌ చరణ్‌

    By Srikanya
    |

    హైదరాబాద్: ''క్రికెట్‌ అంటే నాకు ఇష్టమే. అయితే ఎప్పుడూ పెద్దగా ఆడింది లేదు. ఈ మ్యాచ్‌ కోసం నేను ప్రత్యేకంగా సిద్ధమవ్వలేదు. షూటింగ్‌ నుంచి సరాసరి మైదానానికి చేరుకొన్నాను. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మైదానంలోకి దిగడం చక్కటి అనుభూతి'' అన్నారు హీరో రామ్‌చరణ్‌. ఆదివారం జరిగిన మ్యాచ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు చరణ్‌.

    రామ్ చరణ్ మైదానంలో ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు పెద్దయెత్తున సందడి చేశారు. సీసీఎల్‌లో తొలిసారి ఆడుతున్నారు, ఎలా ఉంది అనుభవం? అని అడిగితే... ''చాలా బాగుంది. అన్ని చిత్ర పరిశ్రమలు ఒక వేదికపైకి రావడం అరుదైన విషయం. ప్రేక్షకులకు చక్కటి వినోదం పంచుతోంది. ఏ జట్టుకైనా నాయకత్వం ముఖ్యం. వెంకటేష్‌ మంచి కెప్టెన్‌. ఆయన ఆధ్వర్యంలో ఆటగాళ్లంతా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. శ్రీకాంత్‌ నాకు అన్నయ్యలాంటివారు. ఆయన జట్టులో ఉన్నారు. ఇతర సహ నటులతో కలిసి ఆడటం ఎంతో ఆనందాన్నిస్తోంది''అన్నారు.

    ప్రస్తుతం రామ్ చరణ్ రెగ్యులర్ గా... జంజీర్ రీమేక్ లో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం 'జంజీర్'పై అభిమానులు భారీ అంచనాలు పెట్టున్నారు. ఈ సినిమా తొలి టీజర్ హైదరాబాద్ లో ఈ నెల 17న జరిగే సిసిఎల్-3 మ్యాచ్ సందర్భంగా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించడంతో..... రామ్ చరణ్ బాలీవుడ్ లుక్ ఎలా ఉంటుదనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానులందరినీ డిస్సప్పాయింట్ చేస్తూ ఆ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా ప్రకటన చేసారు. రేపు సిసిఎల్ 3 మ్యాచ్ సందర్భంగా 'జంజీర్' టీజర్ విడుదల చేయడం లేదని, అనుకున్న సమయానికి టీజర్ విడుదల చేయకపోవడం పట్ల క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

    అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

    English summary
    Ram Charan entertained the audience as the new player in CCL 3. This is needless to say that the team Telugu Warriors has got new attention with this.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X