»   » రంగస్థలం వారికోసం చేయలేదు.. చేయను.. అందుకే గర్వపడే సినిమా.. నేను ఒప్పుకోకపోతే.. రాంచరణ్

రంగస్థలం వారికోసం చేయలేదు.. చేయను.. అందుకే గర్వపడే సినిమా.. నేను ఒప్పుకోకపోతే.. రాంచరణ్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rangasthalam Team Arranges Thanks Meet

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్నది. చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటనకు ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను రంగస్థలం సినిమా తిరగరాస్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాంచరణ్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని నేను సినిమాలను అంగీకరించను అని స్పష్టం చేశాడు.

   అప్పుడే అందరి గురించి

  అప్పుడే అందరి గురించి

  రంగస్థలం సినిమా సక్సెస్ కారణమైన ప్రతీ ఒక్కరి గురించి నాకు చాలా చెప్పాలని ఉంది. కానీ త్వరలోనే సక్సెస్ మీట్ పెడుతున్నట్టు నిర్మాత నవీన్ గారు చెప్పారు. ఆ సభలో ప్రతీ ఒక్కరి గురించి నేను మాట్లాడుతాను అని రాంచరణ్ అన్నారు.

   సుకుమార్ విజన్‌కు తగినట్టుగా

  సుకుమార్ విజన్‌కు తగినట్టుగా

  గొప్ప కథతో సుకుమార్ నా వద్దకు వచ్చాడు. ఆయన విజన్‌కు తగినట్టుగా మేమంత పనిచేశాం. నటించమని చెప్పడానికి రంగస్థలం సినిమా సాధిస్తున్న సక్సెస్ గొప్ప ఉదాహరణ.

   అప్పుడే గర్వపడే సినిమాలు

  అప్పుడే గర్వపడే సినిమాలు

  సాధారణంగా నేను ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయను. నేనెప్పుడూ ఫ్యాన్స్ ఆలోచించి రంగస్థలం సినిమా ఒప్పుకోలేదు. సుకుమార్ చెప్పిన కథ విన్నాక నాకు బాగా నచ్చింది. ఏసీ రూమ్‌లో కథలు వింటాం. అవి మాకు నచ్చినప్పుడే అభిమానులు, తల్లిదండ్రులు గర్వపడే సినిమాలు వస్తుంటాయి.

  సుకుమార్‌కు థ్యాంక్స్

  సుకుమార్‌కు థ్యాంక్స్

  ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొంటే రంగస్థలం లాంటి సినిమా రాదు. అద్భుతమైన పాత్రను, కథను అందించి భారీ విజయాన్ని సాధించినందుకు నేను సుకుమార్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను.

  సక్సెస్ టాక్ వింటే ఆనందంగా

  సక్సెస్ టాక్ వింటే ఆనందంగా

  రంగస్థలం సినిమా సాధిస్తున్న కలెక్షన్ల గురించి వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా డిస్టిబ్యూటర్లు, సినిమాతో అనుబంధం ఉన్నవారందరూ లాభపడుతుంటే సక్సెస్ సాధించిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం కలుగుతున్నది.

   డిస్టిబ్యూటర్లంటే నాకు గౌరవం

  డిస్టిబ్యూటర్లంటే నాకు గౌరవం

  సాధారణంగా మిగితా వ్యాపారాల్లో లాభాలు వస్తే వాటిని వేరే వ్యాపారంలో పెట్టుబడులు పెడుతుంటారు. సినిమా పరిశ్రమలో డిస్టిబ్యూటర్లకు లాభం వస్తే మళ్లీ ఇండస్ట్రీలోనే పెడుతుంటారు. అలాంటి డిస్టిబ్యూటర్లంటే నాకు చెప్పలేనంత గౌరవం ఉంటుంది. వేసవిలో రిలీజ్ అయ్యే ప్రతీ సినిమా కూడా రంగస్థలం చిత్రం మాదిరిగానే విజయం సాధించాలని కోరుకొంటున్నాను.

  మీడియా సహకారం మరువలేనిది

  మీడియా సహకారం మరువలేనిది

  రంగస్థలం లాంటి మంచి సినిమా చేసినపుడు మీడియా అందించిన సహకారం మరువలేనిది. మేము అడుగకుండానే మంచి రివ్యూలు రాసి సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే విధంగా వ్యవహరించారు. అందుకు మీడియా ప్రతినిధులందరికీ అందరికీ నా థ్యాంక్స్.

  నేను ఒప్పుకోకపోతే సుకుమార్

  నేను ఒప్పుకోకపోతే సుకుమార్

  థ్యాంక్స్ మీట్ అనంతరం దర్శకుడు సుకుమార్, హీరో రాంచరణ్ మీడియాతో మాట్లాడారు. కొందరు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. రంగస్థలం కథను నేను ఒప్పుకోకపోతే సుకుమార్ మరో హీరో వద్దకు వెళ్లేవాడు అని రాంచరణ్ చమత్కరించారు. అయితే రాంచరణ్ ఒప్పుకోకపోతే ఈ కథను మరే హీరోతో తీసేవాడిని కాదు అని సుకుమార్ వివరణ ఇవ్వడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

  English summary
  Rangasthalam starring Ram Charan and Samantha Akkineni getting good buzz from all over the world. The film directed by Sukumar has earned a tremoundous positive talk. It is a film set in the 80s and unfolds in a village. The film also stars Adhi Pinisetty, Jagpathi Babu and Prakash Raj in pivotal roles. This movie released on March 30th. In this occassion, film unit conducted a Thanks meet. In this event Ram Charan speaks out emotionally.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more