»   » రామ్ చరణ్-కృష్ణ వంశీ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

రామ్ చరణ్-కృష్ణ వంశీ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ త్వరలో కృష్ణ వంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నరంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమేనని, వెంకటేష్ గారితో కలిసి పని చేయబోతున్నట్లు రామ్ చరణ్ సైతం మీడియాకు స్వయంగా వెల్లడిచారు. ఈ చిత్రం వెంటనే ప్రారంభించాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు టీమ్...రామ్ చరణ్ సరసన చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

ఇప్పుడు మల్టిస్టారర్స్ టైమ్ నడుస్తోంది. ఆ ట్రెండ్ ని అనుసరిస్తూ రామ్ చరణ్ ..ఎవడు చిత్రం చేస్తున్నారు. అయితే అందులో అల్లు అర్జున్ చిన్న పాత్రలో మాత్రమే కనిపించనున్నారు. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ మరో మల్టిస్టారర్ కి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తో పాటు ఈ సారి వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ నటించనున్నారని సమాచారం. కథ ఇంతకు ముందు...నాగచైతన్య,నాగార్జున, అక్కినేనిలతో కృష్ణ వంశీ చేద్దామనుకున్న కథే అని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' విడుదలై ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి ఫ్లాప్ట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ 'తుఫాన్' విషయంలో కూడా వీక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మరో వైపు చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ వాతావరణం కాస్త చల్లబడ్డాక ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

మరో ప్రక్క తెలుగులో నాగ చైతన్య-సునీల్ మల్టీ స్టారర్‌గా రూపొందిన 'తడాఖా' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తాజాగా బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈచిత్రాన్ని బాలీవుడ్లో సంయుక్తంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

బాలీవుడ్ వెర్షన్లో నాగ చైతన్య పాత్రకు షాహిద్ కపూర్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఇంకా ఈ విషయం ఫైనల్ కాలేదని అంటున్నారు. నాగ చైతన్య పాత్రకు రామ్ చరణ్‌ను తీసుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జంజీర్ సినిమాలో రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు చేయడంతో కరణ్ జోహార్ దృష్టి రామ్ చరణ్‌పై పడినట్లు బాలీవుడ్ టాక్.

English summary
Ram Charan has decided to move on his other new commitments. He will be doing Krishnavamsi's film immediately. Venkatesh will also be sharing screen space with Cherry in this Krishnavamsi's movie that will to the sets in the first week of October. Bandla Ganesh is the producer. Currently, scout is on for finding perfect glamorous heroine for Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu