»   » రామ్ చరణ్ ని కలిసిన బాల మగధీర..హామీ (ఫొటో)

రామ్ చరణ్ ని కలిసిన బాల మగధీర..హామీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొత్తానికి రామ్ చరణ్ అన్వేషణ ఫలించింది. ఆయన వెతుకుతున్న పిల్లాడు దొరికాడు. ఆ పిల్లాడు ఆయన వీరాభిమాని. మగధీర డైలాగులు చెప్తూంటే ముగ్దుడైపోయి ఆ పిల్లాడు ఎక్కడున్నా వెతికిపెట్టమని సోషల్ నెట్ వర్క్ లో ఆయన రిక్వెస్ట్ చేసారు. ఇదిగో మొత్తానికి టీవి 9 వారి సాయింతో ఆ పిల్లాడు రామ్ చరణ్ ని చేరుకున్నారు. ఈ పిల్లాడు తో రామ్ చరణ్ ఇదిగో ఇలా ఫొటో దిగారు. అంతేకాదు. తను ఆ పిల్లవాడి ఖర్చు మొత్తం భరిస్తానని తెలియచేసారు.

ఈ పిల్లవాడి పేరు పరుసరామ్. మహబూబ్ నగర్ అజీర గ్రామానికి చెందినవాడు. చాలా పేద కుటుంబానికి చెందిన పరుసరామ్..చిరంజీవి, రామ్ చరణ్ లకు వీరాభిమాని. వారి వాయిస్ లతో అతను డైలాగులు చెప్పటం స్పెషాలిటీ. అంతేకాదు వారిని అనుకరిస్తూ డాన్స్ లు చేస్తూంటాడు. ఇవి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో బాగా పాపులర్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ram Charan meet real magadheera fan

రామ్ చరణ్ సినిమాల విషయానికిస్తే...
రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకుడిగా కొత్త చిత్రం ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. డివివి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. . కథ చాలా బాగా వచ్చింది. రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో నా కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. మళ్ళీ మా కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

English summary
Ram Charan said: At last met the real magadheera fan...this kid is super fun and talented. Thanks to tv9 for finding him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu