For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ కి దెబ్బ తగలి..అపోలో లో ..?

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్ చరణ్ కి నాయక్ చిత్రం షూటింగ్ యాక్షన్ సీక్వెన్స్ లో దెబ్బలు తగిలాయంటూ ఓ వార్త అంతటా ప్రచారమవుతోంది. ఆయన తన ముక్కుకి బాగా దెబ్బ తగలటంతో అపోలో హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లోనే కాక నెట్ లో కూడా కనిపిస్తోంది..వినపిస్తోంది. అయితే నిజా నిజాలు తెలియరాలేదు. ఈ విషయమై అధికారికంగా రామ్ చరణ్ కి చెందిన వారు వివరణ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే అభిమానులు ఈ వార్త విని ఆందోళన చెందుతున్నారు.

  ఇక రామ్ చరణ్ కి ఈ రకంగా ముక్కుకి దెబ్బ తగలటం వల్లే...జంజీర్ షూటింగ్ వాయిదా పడిందని చెప్పుకుంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న జంజీర్ డిసెంబర్ చివరి వారంలో షెడ్యుల్ ఉంది. అది కాన్సిల్ అవటానికి కారణం ఇదే అంటున్నారు. ఇక పిబ్రవరి 2013 వరకూ సంజయ్ దత్,ప్రియాంక చోప్రా డేట్స్ కూడా లేవట. దాంతో నెక్ట్స్ షెడ్యూల్ మరింత దూరం వెళ్లే అవకాసం ఉందని అంటున్నారు. ఇక ఈ వార్తే కనుక నిజమైతే త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

  జంజీర్ విషయానికి వస్తే... రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' బాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందంటున్నారు. జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ ..విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా,తేజ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి),సంజయ్ దత్(హిందీ వెర్షన్ కి),మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు.

  ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు. మరో ప్రక్క ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈచిత్రాన్ని ఏప్రిల్ 12, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.

  రామ్ చరణ్ జంజీర్ గురించి మాట్లాడుతూ..''ఈ సినిమా నాకో సవాల్‌. తప్పకుండా ఈ సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉంది. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. రామ్ చరణ్ బాలీవుడ్ కి కొత్త వాడు కావటంతో అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.'' అని చెప్పారు.

  English summary
  
 Rumor say that Ram Charan who was doing few action sequences for his Telugu film ‘Naayak’ got injured badly on his nose and has been admitted into the Apollo Hospitals. Sources say with the kind of injury he got, the shooting schedule of ‘Zanjeer’ scheduled in the last week of December has been cancelled.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X